APPSC FRO 2025 Exam Dates: ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో మొత్తం 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్ష తేదీలను తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం..

APPSC FRO 2025 Exam Dates: ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ పరీక్ష ఎప్పుడంటే?
APPSC FRO 2025 Exam

Updated on: May 14, 2025 | 7:03 AM

అమరావతి, మే 14: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ మెయిన్స్‌ పరీక్ష తేదీలను తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం జూన్‌ 2 నుంచి 4వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో ఓఎంఆర్‌ ఆధారితంగా ఈ పరీక్షలు జరగనున్నాయి. క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ అండ్‌ జనరల్‌ తెలుగు 2వ తేదీ, జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ (పేపర్‌-1), మ్యాథమెటిక్స్‌ (పేపర్‌-2) పరీక్షలు జూన్‌ 3న, జనరల్‌ ఫారెస్ట్రీ-1 (పేపర్‌-3), జనరల్‌ ఫారెస్ట్రీ-2 (పేపర్‌-4) పరీక్షలు జూన్‌ 4వ తేదీన జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. కాగా ఈ ఏడాది మార్చి 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 15,308 అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో మొత్తం 37 ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.

ఏపీ డీఈఈసెట్‌ 2025 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీఈఈసెట్‌-2025 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగించినట్లు పాఠశాల విద్యాశాఖ ఓ ప్రటకనలో తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్‌)ను నిర్వహించనున్నారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు, ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక రాత పరీక్ష జూన్‌ 2, 3వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది.

తెలంగాణ ఎడ్‌సెట్‌ 2025 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

తెలంగాణ ఎడ్‌సెట్‌ 2025 గడువును పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. నేటితో దరఖాస్తు గడువు పూర్తవగా ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.