AP CETS Exam Dates: ఏపీలో జరిగే కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షల తేదీల ప్రకటన.. ఏ పరీక్షను ఎప్పుడు నిర్వహించనున్నారంటే.

| Edited By: Narender Vaitla

Jul 09, 2021 | 7:39 PM

AP CETS Exam Dates: కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతోన్న వేళ మళ్లీ అన్ని కార్యక్రమాలు యధావిథిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ పరీక్షల నిర్వహణ కోసం సన్నద్ధం అవుతోంది. ముఖ్యంగా కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షలను...

AP CETS Exam Dates: ఏపీలో జరిగే కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షల తేదీల ప్రకటన.. ఏ పరీక్షను ఎప్పుడు నిర్వహించనున్నారంటే.
Ap Cets Exams Dates
Follow us on

AP CETS Exam Dates: కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతోన్న వేళ మళ్లీ అన్ని కార్యక్రమాలు యధావిథిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ పరీక్షల నిర్వహణ కోసం సన్నద్ధం అవుతోంది. ముఖ్యంగా కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తాజాగా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షల తేదీలను ప్రకటించారు. ఇందులో భాగంగనే సదరు పరీక్షల నిర్వహణకు ఛైర్మన్‌, కన్వీనర్‌లను కూడా నియమించారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు..

* జెఎన్‌టీయూ కాకినాడ నిర్వహించే AP EAPCET (ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) పరీక్షను ఆగస్టు 19 – 25 మధ్యలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు ఫ్రొఫసర్లు రామలింగరాజును, వి. రవీంద్రలను ఛైర్మన్, కన్వీనర్‌లుగా నియమించారు.

* జెఎన్‌టీయూ అనంతపురం నిర్వహించే ECET పరీక్షను సెప్టెంబర్‌ 19న నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు ఛైర్మన్‌గా ప్రొఫెసర్‌ జి. రంగనాధం, కన్వీనర్‌గా సి. శశిధర్‌ను నియమించారు.

* విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్సిటీ నిర్వహించే ICET పరీక్షను సెప్టెంబర్‌ 17-18 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు ప్రొఫెసర్‌లు పివిజిడి ప్రసాదరెడ్డిని చైర్మన్‌గా, జీ శశిభూషణ్ రావు కన్వీనర్‌గా నియమించారు.

* తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నిర్వహించే PGECET పరీక్షలను సెప్టెంబర్‌ 27-30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు ప్రొఫెసర్లు కే రాజారెడ్డిని చైర్మన్‌గా.. ఆర్. సత్యనారాయణను కన్వీనర్‌గా నియమించారు.

* తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ నిర్వహించే LAWCET పరీక్షను సెప్టెంబర్‌ 22న నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం.. ప్రొఫెసర్లు డి. జమునను చైర్మన్‌గా, చంద్రకళను కన్వీనర్‌గా నియమించారు.

* విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించే EDCET పరీక్షను సెప్టెంబర్‌ 21న నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రొఫెసర్‌లు ప్రసాదరెడ్డిని చైర్మన్‌గా, వెంకటేశ్వరరావును కన్వీనర్‌గా నియమించారు.

Also Read: Bride Dance Viral Video: వివాహ వేడుకకు జోష్‌ పెంచిన పెళ్లి కూతురు.. చీర కట్టులో అదిరిపోయే స్టెప్పులు..

Income Tax Recruitment: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు.?

AP Schools Reopen: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల పునఃప్రారంభానికి సిద్ధమవుతోన్న సర్కార్‌.. హైకోర్టుకు తేదీ తెలిపిన ప్రభుత్వం.