10th Class Exam: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెరిగిందోచ్.. ఎప్పటివరకంటే

|

Nov 19, 2024 | 4:31 PM

వచ్చే మార్చిలో జరగనున్న పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువు మరోమారు పెరిగింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు మరో వారం రోజుల వారకు గడువు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది..

10th Class Exam: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెరిగిందోచ్.. ఎప్పటివరకంటే
10th Class Exam
Follow us on

అమరావతి, నవంబరు 19: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్ధులకు 2024-25 విద్యాసంత్సరానికి వచ్చే ఏడాది మార్చిలో పబ్లిక్‌ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది. అక్టోబర్‌ 28వ తేదీ నుంచి ప్రారంభమైన ఫీజు చెల్లింపులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 11వ తేదీ వరకు ఫీజు కట్టేందుకు అవకాశం ఇచ్చింది. అయితే ఈ గడువును నవంబర్ 18 వరకు పొడిగించిన పాఠశాల విద్యాశాఖ మరోమారు ఆ గడువును పొడిగించింది.

గడువును మరో వారం రోజులపాటు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ శ్రీనివాసులరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నంబరు 26 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించొచ్చని సూచించారు. రూ.50 అపరాధ రుసుముతో డిసెంబరు 2 వరకు, రూ.200తో డిసెంబరు 9 వరకు, రూ.500తో డిసెంబరు 16 వరకు ఫీజు కట్టొచ్చని వెల్లడించారు. పాఠశాల లాగిన్‌ ద్వారా ప్రధానోపాధ్యాయులు ఆన్‌లైన్‌లోనే పరీక్ష ఫీజు చెల్లించడానికి విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125, సప్లిమెంటరీ రాసేవారు మూడు సబ్జెక్టుల వరకు రూ.110, అంతకంటే ఎక్కువ ఉంటే రూ.125, వృత్తి విద్యా విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలని తెలిపారు. వయసు తక్కువగా ఉండి పరీక్షలకు హాజరయ్యే వారు రూ.300, మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ అవసరమయ్యే వారు రూ.80 చెల్లించాలని సూచించారు.

కాలేజీల్లో కొత్త ఫీజులపై దరఖాస్తు గడువు పెంపు.. చివరి తేదీ ఇదే

తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ తదితర వృత్తి విద్యా కాలేజీల్లో కొత్త ఫీజులు నిర్ణయించేందుకు కాలేజీలు దరఖాస్తు చేసుకునే గడువు మరోమారు పెరిగింది. ఈ మేరకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ మండలి (టీఏఎఫ్‌ఆర్‌సీ) పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు నవంబరు 18తో గడువు ముగియగా.. ఆ గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.