AP SSC 2024 Marks Memos: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి మార్కుల మెమోలు విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి

|

Jun 30, 2024 | 5:13 PM

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గత బుధవారం (జూన్‌ 26) విడుదలైన సంగతి తెలిసిందే. టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో మొత్తం 62.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,07,883 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 67,115 మంది ఉత్తీర్ణులైనట్లు టెన్త్‌ బోర్డు వెల్లడించింది. వీరిలో బాలురు 40,638 (59.99 శాతం), బాలికలు 26,477 (65.96 శాతం) మంది పాసైయ్యారు. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమోలు..

AP SSC 2024 Marks Memos: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి మార్కుల మెమోలు విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి
AP SSC 2024 Marks Memo
Follow us on

అమరావతి, జూన్‌ 30: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గత బుధవారం (జూన్‌ 26) విడుదలైన సంగతి తెలిసిందే. టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో మొత్తం 62.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,07,883 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 67,115 మంది ఉత్తీర్ణులైనట్లు టెన్త్‌ బోర్డు వెల్లడించింది. వీరిలో బాలురు 40,638 (59.99 శాతం), బాలికలు 26,477 (65.96 శాతం) మంది పాసైయ్యారు. తాజాగా ఈ పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమోలు విడుదలయ్యాయి. ఈ మేరకు పదో తరగతి అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల షార్ట్‌ మెమోలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

గతంలో ఇచ్చిన షార్ట్‌ మెమోల్లోని తప్పులను సరి చేసి, వాటిని కూడా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. తాజాగా జారీ చేసిన షార్ట్‌ మెమోల్లోనూ ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత ఆధారాలతో జులై 6వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు. కాగా సప్లిమెంటరీ పరీక్షలకు రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు జులై 1వ తేదీతో గడువు ముగియనుంది.

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి షార్ట్‌ మెమోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఐటీఐ రెండో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానం.. జులై 24 గడువు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తులు కోరుతున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్, ప్రభుత్వ పాత ఐటీఐ ప్రిన్సిపల్‌ జె శ్రీకాంత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తాము ప్రవేశాలు పొందగోరే ఐటీఐ కాలేజీలో జులై 24వ తేదీలోగా దరఖాస్తులు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో.. ఏదైనా ఓ కాలేజీలో విద్యార్ధులు తమ ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలన్నారు. అటువంటి అభ్యర్థులే కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హులని తెలియజేశారు. ఎవరైనా ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోకుంటే.. అటువంటి వారి పేర్లు మెరిట్‌ జాబితాలో కనిపించవని ఆయన తెలిపారు. ఈ విషయంలో అశ్రద్ధ చేయడం తగదని హెచ్చరించారు. జులై 27, 28 తేదీల్లో ప్రభుత్వ ఐటీఐ కాలేజీలకు, 29, 30 తేదీల్లో ప్రైవేట్‌ ఐటీఐ కాలేజీలకు సంబంధించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారని ఆయన తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.