AP 10th Class Results 2024: ఏపీ టెన్త్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఫలితాల విడుదల తేదీ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పదోతరగతి విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్‌ చివరి వారంలో విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోంది. అంటే ఏప్రిల్‌ 25 నుంచి 30వ తేదీలోపు టెన్త్‌ ఫలితాలు ప్రకటించనుందన్నమాట. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నెంబర్‌ను నమోదు చేసి..

AP 10th Class Results 2024: ఏపీ టెన్త్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఫలితాల విడుదల తేదీ ఇదే!
AP 10th Class Result Date
Follow us

|

Updated on: Apr 16, 2024 | 7:08 AM

అమరావతి, ఏప్రిల్‌ 16: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పదోతరగతి విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్‌ చివరి వారంలో విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోంది. అంటే ఏప్రిల్‌ 25 నుంచి 30వ తేదీలోపు టెన్త్‌ ఫలితాలు ప్రకటించనుందన్నమాట. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నెంబర్‌ను నమోదు చేసి ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల అధికారిక విభాగాలు వెల్లడించాయి. కాగా గతేడాది మే 6వ తేదీన పదో తరగతి ఫలితాలు వెల్లడించామని, ఈ ఏడాది అంతకంటే ముందే ఫలితాలు వెల్లడిస్తామని డైరెక్టర్‌ దేవానంద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి18 నుంచి మార్చి 30 వరకు పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వార్షిక పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,30,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక రాష్ట్రంలో దాదాపు 3473 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల ప్రక్రియ అనంతరం వెనువెంటనే సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభించి ఏప్రిల్‌ 8 నాటికి ముగించారు. మూల్యాంకనం చేసిన జవాబుపత్రాలను మరోసారి పరిశీలించి.. ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు, కంప్యూటరీకరణ ప్రక్రియ చేపట్టారు. ఈ విధానం పూర్తి చేసేందుకు మరో వారం సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో.. పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు కూడా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరైంది. ఇప్పటికే పదో తరగతి బోర్డు అధికారులు ఏప్రిల్‌ చివరి వారంలో ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రావడం ఆలస్యమైతే మే మొదటి వారంలో ఫలితాల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఫలితాల విడుదల వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకునేందుకు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితాలతోపాటు మార్కుల మెమోను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఫలితాల ప్రకటన తర్వాత కొన్ని రోజులకు తాము చదువుకున్న పాఠశాలల నుంచి విద్యార్ధులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు పొందవచ్చు. అయితే మార్క్‌ షీట్‌లో గ్రేడ్స్‌ మాత్రమే ఉంటాయి. ఏ సబ్జెట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయన్న వివరాలు అందులో ఉండవని బోర్డు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఈ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీలు.. నివాసితులు లేరు..
ఈ దేశంలో 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీలు.. నివాసితులు లేరు..
ధర్మం కోసం యుద్ధం తప్పదు.. హరిహర వీరమల్లు టీజర్..
ధర్మం కోసం యుద్ధం తప్పదు.. హరిహర వీరమల్లు టీజర్..
అమాయకపు చూపుల చిన్నారిని గుర్తుపట్టండి..
అమాయకపు చూపుల చిన్నారిని గుర్తుపట్టండి..
తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడనున్న 6గురు.. లిస్టులో హైదరాబాదీ..
తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడనున్న 6గురు.. లిస్టులో హైదరాబాదీ..
చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా..! పిల్ల‌ల‌కు ఇలాంటివే
చిన్నారి సంస్కారానికి ఆనంద్ మహీంద్రా ఫిదా..! పిల్ల‌ల‌కు ఇలాంటివే
తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్.. ఫ్లాన్ ఇదే!
తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ స్పెషల్‌ ఫోకస్.. ఫ్లాన్ ఇదే!
ఉల్లి పకోడీ బోర్ కట్టిందా..గులాబీ పకోడీ తినమంటున్న యువకుడు
ఉల్లి పకోడీ బోర్ కట్టిందా..గులాబీ పకోడీ తినమంటున్న యువకుడు