District Jail Anantapuramu Recruitment: అనంత‌పురం జిల్లా జైలులో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ..

|

Jun 14, 2021 | 6:03 AM

District Jail Anantapuramu Recruitment 2021: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం జిల్లా జైలులో ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేశారు. జైళ్ల శాఖ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్ట‌నున్న ఈ నియామ‌కంలో భాగంగా.. పారామెడిక‌ల్ స్టాఫ్‌, ఎల‌క్ట్రీషియ‌న్ పోస్టుల‌ను భ‌ర్తీ..

District Jail Anantapuramu Recruitment: అనంత‌పురం జిల్లా జైలులో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ..
Anantapuram Jail
Follow us on

District Jail Anantapuramu Recruitment 2021: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం జిల్లా జైలులో ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేశారు. జైళ్ల శాఖ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్ట‌నున్న ఈ నియామ‌కంలో భాగంగా.. పారామెడిక‌ల్ స్టాఫ్‌, ఎల‌క్ట్రీషియ‌న్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 6 పోస్టుల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు రేప‌టితో గ‌డువు ముగియ‌నున్న నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివరాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా.. ఫార్మసిస్ట్ (01), ల్యాబ్‌ టెక్నీషియన్ (01), మేల్‌ నర్సింగ్ (02), ఫీమేల్‌ నర్సింగ్ (01), ఎలక్ట్రీషియన్ (01) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఫార్మ‌సిస్ట్ గ్రేడ్ – 2 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. ఫార్మ‌సీ/బీఫార్మ‌సీ విబాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో వివరాలు నమోదు చేసుకొని ఉండాలి.

* ల్యాబ్ టెక్నీషియ‌న్ గ్రేడ్ – 2 పోస్టుల‌కు అప్లై చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు.. పదో తరగతి, డీఎంఎల్‌టీ/బీఎస్సీ, ఎంఎల్‌టీ ఉత్తీర్ణతతో పాటు.. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో వివరాలు నమోదు చేసుకొని ఉండాలి.

* మేల్, ఫీమేల్‌నర్సింగ్‌ గ్రేడ్‌–2 పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థ‌లు.. పదో తరగతి ఉత్తీర్ణత‌తో పాటు… ప్రాథమిక చికిత్స సంబంధించిన ధ్రువపత్రం ఉండాలి.

* ఎల‌క్ట్రీషియ‌న్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఎల‌క్ట్రిక‌ల్ విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* పూర్తి వివ‌రాల‌తో కూడిన ద‌ర‌ఖాస్తును అనంత‌పురం, సూపరిండెంట్, జిల్లా జైలు అడ్ర‌స్‌కు పంపించాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ రేప‌టితో (15-06-2021) ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: మహా కుంభ్ మేళాలో ఫేక్ కోవిద్ టెస్టింగ్ ల్యాబ్…..భారీ ఫ్రాడ్.. ..దర్యాఫ్తునకై ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశం

బాలయ్య కోసం అదిరిపోయే కథను సిద్ధం చేసిన అనిల్ రావిపూడి.. సినిమా పట్టాలెక్కేది ఎప్పుడంటే..

Guinness World Records: కృత్రిమ కాలుతో గోడకుర్చీ…దివ్యాంగ మహిళ గిన్నీస్ రికార్డు – Watch Video