Amazon Free Coaching For JEE: మీరు ఐఐటీ, జేఈఈ కోర్సుల కోసం సిద్ధమవుతున్నారా.? ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో జేఈఈ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? మీలాంటి వారి కోసమే అమేజాన్ ఒక సదవకాశాన్ని తీసుకొచ్చింది. అమేజాన్ అకాడమీ పేరుతో ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసింది.
తాజాగా ఈ ప్టాట్‌ఫామ్ ద్వారా ఐఐటీ జేఈఈ విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తోంది. కేవలం రికార్డెడ్ వీడియోలే కాకుండా పలు సబ్జెక్ట్స్‌లో నిపుణులైన జేఈఈ టీచర్స్‌తో సెషన్స్ కూడా అందిస్తోంది. అమెజాన్ అకాడమీ ప్లాట్‌ఫామ్‌లో విద్యార్థులకు కావాల్సిన కంటెంట్ ఉంటుంది. యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్ ఆన్‌లైన్ క్లాసులతో పాటు మాక్ టెస్టుల్లో పాల్గొనొచ్చు. రియల్ టైమ్‌లో తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. అమెజాన్ అకాడమీ ప్లాట్‌ఫామ్‌లో జేఈఈ టెస్ట్ రాసుకొవచ్చు. అంతేకాకుండా రాసిన పరీక్షకు పర్ఫామెన్స్ రిపోర్ట్స్ కూడా పొందవచ్చు. అంతేకాకుండా ప్రాక్టీస్ టెస్ట్ కోసం క్వశ్చన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో 15,000కిపైగా ప్రశ్నలు ఉన్నాయి. కేవలం ప్రశ్నలే కాకుండా వాటికి సొల్యుషన్స్ కూడా అర్థమయ్యేలా అందుబాటులో ఉంచారు. వీటితో పాటు నిపుణుల నుంచి ఎగ్జామ్ టిప్స్ కూడా లభిస్తాయి.
* అమేజాన్ అకాడమీలో ఎన్‌రోల్ చేసుకోవాలంటే https://academy.amazon.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* ఇక గూగుల్ ప్లే స్టోర్‌లో అమెజాన్ అకాడమీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కూడా ఎన్‌రోల్ చేసుకోవచ్చు.
* ప్రస్తుతం కొన్ని నెలలపాటు ఈ సేవలను ఉచితంగా అందుబాటులో ఉంచారు.