PM Narendra Modi: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై నుంచి కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తనకు చాలా మంది బాలికలు లేఖలు రాస్తున్నారని.. ప్రతి ఒక్కరూ సైనిక స్కూళ్లల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు ఇక నుంచి అన్ని సైనిక్ స్కూళ్లలో బాలికలకు ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక్ స్కూళ్లు ఉన్నాయి. రెండున్నరేళ్ల కిందట తొలిసారి మిజోరంలోని సైనిక్ స్కూల్‌లో బాలికలను అనుమతించినట్లు మోదీ వెల్లడించారు.
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న కూతుళ్ల కోసం అన్ని సైనిక్ స్కూళ్ల తలుపులు తెరుచుకుంటాయని ప్రధాని మోదీ తెలిపారు. భారతదేశ సమగ్రాభివృద్ధికి ప్రతిఒక్కరూ సంకల్పంతో ఉండాలని పేర్కొన్నారు. కాగా.. రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో ఉండే సైనిక్ స్కూల్స్ సొసైటీ ఈ పాఠశాలలను నిర్వహిస్తోుంది. భారత సాయుధ బలగాల వైపు అడుగులు వేసేలా చిన్నతనం నుంచే విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేశారు.
Today, the government has decided that doors of every Sainik School will now be open for its girl child.
– PM @narendramodi #IndiaIndependenceDay pic.twitter.com/d794dHFcmB
— BJP (@BJP4India) August 15, 2021
Also Read: