AISSEE Admit card 2022: సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ అడ్మిట్‌ కార్డు విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి..

|

Dec 29, 2021 | 3:05 PM

AISSEE Admit card 2022: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2022 అడ్మిట్ కార్డ్ విడుదలైంది. దీనికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ

AISSEE Admit card 2022: సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ అడ్మిట్‌ కార్డు విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి..
Sainik School Admission 202
Follow us on

AISSEE Admit card 2022: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2022 అడ్మిట్ కార్డ్ విడుదలైంది. దీనికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 6వ తరగతి, 9వ తరగతిలో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2022కి సిద్ధంగా ఉన్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ aissee.nta.nic.inని సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షను NTA నిర్వహిస్తుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 6వ, 9వ తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. పరీక్ష 9 జనవరి 2022న నిర్వహిస్తారు.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా..?
1. అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ aissee.nta.nic.in ని సందర్శించండి.
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో AISSEE – 2022పై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2022 లింక్‌కి వెళ్లండి.
4. అప్లికేషన్ నంబర్ & పుట్టిన తేదీ ద్వారా లాగిన్ లింక్‌పై క్లిక్ చేయండి.
5. ఇప్పుడు అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేస్తారు.
6. తర్వాత అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై ఓపెన్ అవుతుంది
7. తదుపరి ఉపయోగం కోసం అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ప్రింట్ అవుట్ తీసుకోండి.

పరీక్ష నమూనా
ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆఫ్‌లైన్ అంటే పెన్-పేపర్ మోడ్‌లో జరుగుతుంది. దేశంలోని 176 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా 33 సైనిక్ పాఠశాలల్లో ప్రవేశం పొందగలరు. అడ్మిషన్ కోసం తుది ఎంపిక పాఠశాల వారీగా ర్యాంక్, తరగతుల వారీగా ర్యాంక్ కేటగిరీ వారీగా ర్యాంక్ ఆధారంగా ఉంటుంది. మొదటి సారిగా 2021-22 విద్యా సంవత్సరానికిగాను ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా గర్ల్ క్యాడెట్‌లు సైనిక్ స్కూల్ కజకూటం (SSKZM)లో అడ్మిషన్ పొందుతారు. ఇది రాష్ట్రంలో (కేరళ) మొదటి సైనిక్ స్కూల్. ఇది 1962లో స్థాపించారు.

Omicron: ఈ దేశంలో ఒమిక్రాన్‌ జాతీయ ముప్పు కాదు.. ఎటువంటి ఆంక్షలు లేవు.. ఎందుకంటే..?

NTA CMAT Registration 2022: CMAT పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ఎప్పుడు..? తాజా అప్‌డేట్‌ తెలుసుకోండి..

గుమ్మడికాయ గింజలు కనిపిస్తే అస్సలు వదలద్దు..! నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..