AAI Recruitment 2022: బీటెక్‌/డిప్లొమా అర్హతతో.. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 175 అప్రెంటిస్‌ ఖాళీలు..

|

Oct 07, 2022 | 5:34 PM

భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 175 గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్, ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన..

AAI Recruitment 2022: బీటెక్‌/డిప్లొమా అర్హతతో.. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 175 అప్రెంటిస్‌ ఖాళీలు..
Airports Authority of India
Follow us on

భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 175 గ్రాడ్యుయేట్‌, డిప్లొమా అప్రెంటిస్, ఐటీఐ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎయిరోనాటికల్‌/ఎయిరోస్పేస్‌/ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, స్టెనోగ్రాఫర్, మెకానిక్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏఐసీటీఈ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి నాలుగేళ్ల డిగ్రీ లేదా మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా లేదా ఐటీఐ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ కోర్సు లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నవంబర్‌ 7, 2022వ తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు 26 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్ 7, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. విద్యార్హతల ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన వారికి ఈ కింది విధంగా స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • గ్రాడ్యుయేట్‌/డిప్లొమా అప్రెంటిస్‌ ఖాళీలు: 131
  • ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌ ఖాళీలు: 44

స్టైపెండ్ వివరాలు..

ఇవి కూడా చదవండి
  • ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.9000
  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.15,000
  • టెక్నికల్ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.12,000

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.