ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్.. వారణాసిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 36 కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఆర్‌ఎస్‌ఏ/ యూఏఆర్‌డీ, హ్యాండిమ్యాన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఎస్‌ఎస్‌ఎల్‌సీ/10వ తరగతి/ఐటీఐ/మూడేళ్ల డిప్లొమా/గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 28 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు 2023, ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో కింది అడ్రస్‌లో ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించే ఇంటర్వ్యూకి సంబంధిత డాక్యుమెంట్లతో నేరుగా హాజరుకావచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.500లు చెల్లించవల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్‌మెన్/ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. ఇంటర్వ్యూ/ ట్రేడ్ టెస్ట్/ ఫిజికల్ ఎండ్యురెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.17,850ల నుంచి రూ.23,640ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Pandit Deen Dayal Upaydhayay Inter Collage, Siswan, Babatpur, Varanasi, Pin – 221006, Uttar Pradesh.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.