AIR India Recruitment: ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక…

|

Nov 19, 2021 | 12:47 PM

AIR India Recruitment 2021: ప్రముఖ ఏవియేషన్‌ సంస్థ ఎయిర్‌ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎయిర్‌ ఇండియా అసెట్స్‌ హోల్డింగ్‌ లిటిమెట్‌ (ఏఐఏహెచ్‌ఎల్‌)లో ఈ ఖాళీలను భర్తీ...

AIR India Recruitment: ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక...
Air India Jobs
Follow us on

AIR India Recruitment 2021: ప్రముఖ ఏవియేషన్‌ సంస్థ ఎయిర్‌ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎయిర్‌ ఇండియా అసెట్స్‌ హోల్డింగ్‌ లిటిమెట్‌ (ఏఐఏహెచ్‌ఎల్‌)లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో చీఫ్‌ ప్రాపర్టీస్‌ అండ్‌ మానిటైజేషన్‌ ఆఫీసర్‌ (01), చీఫ్‌ పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (01), డిప్యూటీ చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ (01), మేనేజర్‌ (04), ఆఫీసర్‌ (03) పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో లా డిగ్రీ/ ఎల్‌ఎల్‌ఎం, ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ పూర్తి వివరాలను కంపెనీ సెక్రెటరీ, ఏఐ అసెట్స్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌, రూమ్‌ నెం 208, సెకండ్‌ ఫ్లోర్‌, ఏఐ రిజర్వేషన్‌ బిల్డింగ్‌, సఫ్దార్‌జంగ్‌ ఎయిర్‌ పోర్ట్‌, న్యూఢిల్లీ – 110003 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను పర్సనల్‌ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 07-12-021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: World Record: సరదాగా మొదలు పెట్టిన అలవాటుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌‌ను సొంతం చేసుకున్న ఆరేళ్ళ చిన్నారి.. ఎక్కడంటే

Tim Paine: ‘సెక్స్టింగ్’ వివాదంలో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్‎.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న టిమ్ పైన్..

Lunar Eclipse: నేడు ఈశాన్య భారతంలో పాక్షికంగా చంద్రగ్రహణం.. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..