AIIMS Recruitment: ఎయిమ్స్‌లో ప్రొఫెస‌ర్ ఉద్యోగాలు.. అనుభ‌వం ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక‌..

|

Jan 15, 2022 | 6:06 AM

AIIMS Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ (AIIMS) ప‌లు పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. బిలాస్‌పూర్ క్యాంప‌స్‌లో ప్రొఫెస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

AIIMS Recruitment: ఎయిమ్స్‌లో ప్రొఫెస‌ర్ ఉద్యోగాలు.. అనుభ‌వం ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక‌..
Follow us on

AIIMS Recruitment: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ (AIIMS) ప‌లు పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. బిలాస్‌పూర్ క్యాంప‌స్‌లో ప్రొఫెస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 116 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో ప్రొఫెసర్లు–29, అడిషనల్‌ ప్రొఫెసర్లు–23, అసోసియేట్‌ ప్రొఫెసర్లు–28, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు–36 ఖాళీలు ఉన్నాయి.

* అనాటమీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆప్తామాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

* ప్రొఫెస‌ర్‌ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ /ఎంఎస్‌ /ఎంసీహెచ్‌ /డీఎం /పీజీ ఉత్తీర్ణులవ్వాలి.

* అడిషనల్‌ ప్రొఫెసర్ పోస్టుల‌కు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ /ఎంఎస్‌ /ఎంసీహెచ్‌ /డీఎం/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.

* అసోసియేట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌కు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ /ఎంఎస్‌ /ఎంసీహెచ్‌/డీఎం/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఎండీ /ఎంఎస్‌ /ఎంసీహెచ్‌ /డీఎం/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(రిక్రూట్‌మెంట్‌ సెల్‌), ఎయిమ్స్‌–బిలాస్‌పూర్, ఎట్‌ కోతిపురా–174001 అడ్ర‌స్‌కు పంపించాలి.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టల ఆధారంగా నెల‌కు రూ. 1 ల‌క్ష నుంచి రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇస్తారు.

* అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్‌, రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 15-01-2022తో ముగియనుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Viral video: ఎమ్మెల్యే టికెట్‌ రాలేదని వెక్కి వెక్కి ఏడ్చిన బీఎస్పీ నాయకుడు.. ఆత్మాహుతి చేసుకుంటానంటూ..

Will Writing: వీలునామా రాస్తున్నారా..? గుర్తించుకోవాల్సిన విషయాలు ఇవే…!