AIIMS Recruitment: భారత ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక

|

May 09, 2023 | 11:57 AM

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషణ్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో మొత్తం 153 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

AIIMS Recruitment: భారత ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక
Aiims Jobs
Follow us on

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషణ్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో మొత్తం 153 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగామ మొత్తం 153 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, నియోనాటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, పాథాలజీ పల్మనరీ మెడిసిన్, రేడియాలజీ, సర్జికల్ ఆంకాలజీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/ఎండీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూను అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, 1వ ఫ్లోర్, కమిటీ రూమ్ ఆఫ్ ఎయిమ్స్, కల్యాణి, పిన్ -741245 అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు మే 13ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..