AIIMS Raipur Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. నెలకు రూఎయిమ్స్‌లో గ్రూప్‌ ‘ఏ, బీ’ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన రాయ్‌పూర్‌లోని చత్తీస్‌గఢ్‌లోనున్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Raipur).. క్లినికల్‌ సైకాలజిస్ట్‌, లా ఆఫీసర్‌, జూనియర్‌ ఇంజినీర్ తదితర పోస్టుల (Clinical Psycologist Posts) భర్తీకి..

AIIMS Raipur Recruitment 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. నెలకు రూఎయిమ్స్‌లో గ్రూప్‌ ఏ, బీ ఉద్యోగాలు..
Aiims

Updated on: Jun 16, 2022 | 9:51 AM

AIIMS Raipur Senior Resident Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన రాయ్‌పూర్‌లోని చత్తీస్‌గఢ్‌లోనున్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Raipur).. క్లినికల్‌ సైకాలజిస్ట్‌, లా ఆఫీసర్‌, జూనియర్‌ ఇంజినీర్ తదితర పోస్టుల (Clinical Psycologist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 9

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: క్లినికల్‌ సైకాలజిస్ట్‌, లా ఆఫీసర్‌, జూనియర్‌ ఇంజినీర్, మెడికల్‌ రికార్డ్‌ ఆఫీసర్, రేడియోథెరపీ టెక్నీషియన్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.56,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్, గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ, లా డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంఫిల్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.1000
  • ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.