IIMS Recruitment 2022: ఎయిమ్స్‌ పాట్నలో 173 టీచింగ్‌ ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన పాట్నలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Patna).. 173 టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

IIMS Recruitment 2022: ఎయిమ్స్‌ పాట్నలో 173 టీచింగ్‌ ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Iims Patna

Updated on: Aug 22, 2022 | 9:01 AM

AIIMS Patna Faculty Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన పాట్నలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Patna).. 173 టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, కమ్యూనిటీ & ఫ్యామిలీ మెడిసిన్, డెంటిస్ట్రీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎమ్‌ఎస్/ఎమ్‌డీఎస్/డీఎమ్‌/ఎమ్‌సీహెచ్‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 58 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తు రుసుముగా జనరల్‌ అభ్యర్ధులైతే రూ.1500లు, ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు రూ.1200ల వరకు తప్పనిసరిగా చెల్లించాలి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు సెప్టెంబర్‌ 26, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం నింపిన దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ను చెక్‌ చేసుకోండి.

పోస్టుల వివరాలు:

  • ప్రొఫెసర్ పోస్టులు: 43
  • అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులు: 36
  • అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: 47
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 47

అడ్రస్‌: Recruitment Cell All India Institute of Medical Sciences, Phulwarisharif, Patna (Bihar) – 801507.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.