AIIMS Bhubaneswar Recruitment: భువనేశ్వర్ ఎయిమ్స్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల చివరి తేదీ నేటితో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* నోటిఫికేషన్ భాగంగా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ విభాగాల్లో ఉద్యోగులను తీసుకోనున్నారు.
* దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/ఎండీఎస్/డీఎం/ఎంసీహెచ్/డీఎన్‌బీ)లో ఉత్తీర్ణత సాధించాలి.
* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.
* ఈ ఉద్యోగాల ఎంపిక విధానం వచ్చిన దరఖాస్తులపై ఆధారపడి ఉంటుంది. ఒక వేళ పేర్కొన్న పోస్టులకు దరఖాస్తులు మూడు రెట్లు ఎక్కువగా వస్తే రాతపరీక్ష నిర్వహిస్తారు. లేదంటే కేవలం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* దరఖాస్తులకు స్వీకరణ నేటితో (07-06-2021) ముగియనుంది.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: తేనెటీగలతో సాహసం.. వరల్డ్ ఫేమస్ అయిన యువతి.. వైరల్‌గా మారిన వీడియో.!
Noorjahan Mango: ‘నూర్జహాన్’ మామిడి.. ధర తెలిస్తే షాకే.. ఇంతకీ ఆ మ్యాంగో స్పెషల్ ఏంటంటే.!