AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తేనెటీగలతో సాహసం.. వరల్డ్‌ ఫేమస్‌ అయిన యువతి.. వైరల్‌గా మారిన వీడియో.!

తేనెతుట్టెను కదిలించి సమస్యలు తెచ్చుకోవద్దంటారు పెద్దలు. కానీ, ఇక్కడో యువతి మాత్రం తేనెతుట్టెను కదిలించి వరల్డ్‌ ఫేమస్‌ అయిపోయింది...

Viral Video: తేనెటీగలతో సాహసం.. వరల్డ్‌ ఫేమస్‌ అయిన యువతి.. వైరల్‌గా మారిన వీడియో.!
Bees
Ravi Kiran
|

Updated on: Jun 07, 2021 | 12:09 PM

Share

తేనెతుట్టెను కదిలించి సమస్యలు తెచ్చుకోవద్దంటారు పెద్దలు. కానీ, ఇక్కడో యువతి మాత్రం తేనెతుట్టెను కదిలించి వరల్డ్‌ ఫేమస్‌ అయిపోయింది. అవును మీరు చూస్తున్నది నిజమేనండోయ్‌…ఈ అమ్మాయి..ఒట్టి చేతులతో తేనెతుట్టెలను తొలగిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ యువతి పేరు బీకీపర్స్‌ ఎరికా థాంప్సన్‌…తన అపార్టమ్‌మెంట్‌లో ఉన్న తేనెటీగలను ఈమె అవలీలగా తొలగించింది. ఎలాంటి జంకు భయం లేకుండా చాలా జాగ్రత్తగా చిన్న పిల్లలను పట్టుకున్న మాదిరిగా ఆమె ఆ తేనేటీగలను అక్కడి నుంచి తీసేసింది. పైగా వాటిని ఎలా సంరక్షించాలనే విషయాలు చెబుతూ ఆమె పెట్టిన వీడియోను నెటిజన్లు తెగ లైక్‌లు, షేర్‌లు చేస్తున్నారు.

యువతి చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. తేనే తినడమే కాదు… ఇలాంటి పనులు చేస్తూ పది మందికి ఆదర్శంగా నిలవాలని అంతరించిపోతున్న తేనేటీగలను కాపాడాలని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మనిషి మనుగడకు అవసరమైన తేనిటీగల సంరక్షణకు ఇలాంటి వారి అవసరం ఎంతో ఉందని మరికొందరు కితాబిచ్చారు.

Also Read:

ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..

కరీంనగర్‌లో అరుస్తున్న పాము.? అసలు ఇందులో నిజమెంత..

టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5కు ముహూర్తం ఫిక్స్.! కంటెస్టెంట్స్ వీరేనా.!!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్స్.. విత్‌డ్రా పరిమితి పెంపు..