ASRB Recruitment 2021: భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ బోర్డ్(ఏఎస్‌ఆర్‌బీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది న్యూఢిల్లీలో ఉన్న ఈ సంస్థలో మొత్తం 65 ఖాళీలను భర్తీ చేయనున్నారు. రెండు విభాగాల్లో పోస్టులను రిక్రూట్ చేయనున్న ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
* మొత్తం 65 ఖాళీలకు గాను.. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు(ఏఓ)–44, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్లు–21 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు(ఏఓ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 55శాతం మార్కులకు తగ్గకుండా గ్రాడ్యుయేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. అభ్యర్థుల వయసు 23.08.2021 నాటికి 21ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
* ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్లు ఖాళీలకు అప్లై చేసుకునే వారు కనీసం 55శాతం మార్కులకు తగ్గకుండా గ్రాడ్యుయేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. అభ్యర్థుల వయసు 23.08.2021 నాటికి 21ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* పైన తెలిపిన పోస్టులను మొత్తం మూడు పద్ధతుల్లో రిక్రూట్ చేయనున్నారు. మొదట టైర్ 1లో భాగంగా ప్రిలిమనరీ పరీక్షను నిర్వహిస్తారు. అనంతరం టైర్2లో డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది. ఇక ఈ రెండింటిలో అర్హత సాధించిన వారికి టైర్ 2లో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 23-08-2021 చివరి తేదీగా నిర్ణయించారు.
* ప్రిలిమనరీ పరీక్షను 10-10-2020న నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: AP Transco: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్‌కో నోటిఫికేషన్
CBSE 12th Result 2021 Topper List: సీబీఎస్ఈ బోర్డు ఫలితాల్లో టాపర్స్ వీరే.. పూర్తి వివరాలు మీకోసం..