AAI: పదో తరగతి, డిప్లొమాతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం.. నేటి నుంచే రిజిస్ట్రేషన్స్ ప్రారంభం..

AAI Recruitment: ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏఏఐ చెన్నైలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. పలు విభాగాల్లో ఉన్న జూనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు...

AAI: పదో తరగతి, డిప్లొమాతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం.. నేటి నుంచే రిజిస్ట్రేషన్స్ ప్రారంభం..
Aai Jobs

Updated on: Sep 01, 2022 | 2:24 PM

AAI Recruitment: ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏఏఐ చెన్నైలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. పలు విభాగాల్లో ఉన్న జూనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి (గురువారం) ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏయే విబాగాల్లో ఎన్ని ఖాళీలు, అర్హతలు ఉన్నాయి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 156 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఫైర్‌ సర్వీస్‌, అకౌంట్స్‌, అఫిషియల్‌ ల్యాంగ్వేజీ విభాగాల్లో ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి, డిప్లొమా (మెకానికల్‌/ఆటో మొబైల్‌/ఫైర్‌)/ కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి.

* సీనియర్‌ అసిస్టెంట్‌ ఖాళీలకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ మాస్టర్స్‌ డిగ్రీ(హిందీ/ ఇంగ్లిష్‌) ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్ష, టైపింగ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎండ్యురెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* జూనియర్‌ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.31000 నుంచి రూ.92000 వరకు చెల్లిస్తారు.

* సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.36000 నుంచి రూ.110000 చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 01-09-2022ని ప్రారంభమవుతుండగా చివరి తేదీగా 30-09-2022ని నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..