TGPSC Group1: టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఫలితాల్లో తండ్రీ, కొడుకుల సత్తా.. మెయిన్స్‌కు ఇద్దరూ క్వాలిఫై!

|

Jul 08, 2024 | 11:55 AM

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు జులూ 7న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. అయితే తాజా ఫలితాల్లో ఖమ్మం పట్టణానికి చెందిన తండ్రి, కొడుకులు అర్హత సాధించారు. దాసరి రవికిరణ్‌ ముచ్చర్ల (53) అనే వ్యక్తి జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్‌ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు మైకేల్‌ ఇమ్మానియేలు..

TGPSC Group1: టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఫలితాల్లో తండ్రీ, కొడుకుల సత్తా.. మెయిన్స్‌కు ఇద్దరూ క్వాలిఫై!
TGPSC Group 1 prelims
Follow us on

హైదరాబాద్‌, జూలై 8: తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు జులూ 7న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. అయితే తాజా ఫలితాల్లో ఖమ్మం పట్టణానికి చెందిన తండ్రి, కొడుకులు అర్హత సాధించారు. దాసరి రవికిరణ్‌ ముచ్చర్ల (53) అనే వ్యక్తి జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్‌ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు మైకేల్‌ ఇమ్మానియేలు (25) దూర్యవిద్యలో డిగ్రీ పూర్తి చేశారు. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌కు మైకెల్‌తోపాటు అతని తండ్రి రవి కిరణ్‌ కూడా దరఖాస్తు చేసుకున్నారు.

53 ఏళ్ల వయస్సున్న రవికిరణ్‌ కుమారుడికి అవసరమైన సూచనలు ఇవ్వడంతోపాటు.. తానూ పరీక్ష రాశారు. కుమారుడికి ఇన్పిరేషన్‌గా ఉండేందుకు ఆయన ఈ పరీక్ష రాశాడు. రిజర్వేషన్, ఇన్‌ సర్వీసు కోటాలో వయో మినహాయింపు ఉండటంతో ఆయన పరీక్ష రాయగలిగారు. అయితే అనూహ్యంగా ఆదివారం వెలువడిన ప్రిలిమ్స్ ఫలితాల్లో కుమారుడితోపాటు తండ్రి కూడా మెయిన్స్‌కు క్వాలిఫై కావడంతో ఒక్కసారిగా రాష్ట్రం అంతటా వీరి పేర్లు మారుమ్రోగిపోయాయి.

మరోవివాదంలో ఎన్టీయే.. CUET UG 2024 పరీక్షపై ఫిర్యాదుల వెల్లువ

ఇటీవల కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు CUET-UG పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పరీక్షకు సంబంధించిన యూజీ ప్రవేశ పరీక్ష ‘కీ’ విడుదలైంది. జులై 9 లోగా అభ్యంతరాలు తెలియజేయాలని అభ్యర్ధులకు సూచించింది. అయితే పరీక్ష నిర్వహణపై పలువురు అభ్యర్ధులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఎన్టీయే అభ్యర్థులు లేవనెత్తే ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి జులై 15 నుంచి 19 మధ్య కాలంలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే పలు సాంకేతిక సమస్యలు, పరీక్షా సమయం కోల్పోవడం వంటి ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. కాగా మే 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13.48 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.