TSPSC Group- 3 Exam Date: తెలంగాణ గ్రూప్‌-3కి భారీగా వచ్చిన దరఖాస్తులు.. ఒక్కో పోస్టుకు 390 మంది పోటీ

|

Feb 23, 2023 | 8:58 PM

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-3 సర్వీసుల పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ గురువారం (ఫిబ్రవరి 23) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మొత్తం 1,375 పోస్టులకు గడువు ముగిసే సమయానికి..

TSPSC Group- 3 Exam Date: తెలంగాణ గ్రూప్‌-3కి భారీగా వచ్చిన దరఖాస్తులు.. ఒక్కో పోస్టుకు 390 మంది పోటీ
TSPSC Group- 3 Exam Date
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-3 సర్వీసుల పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ గురువారం (ఫిబ్రవరి 23) సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మొత్తం 1,375 పోస్టులకు గడువు ముగిసే సమయానికి 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు దాదాపు 390 మంది పోటీపడనున్నారు. ఈ పోస్టులకు జనవరి 24 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మొదలైన సంగతి తెలిసిందే. ఐతే చివరి మూడు రోజుల్లో మాత్రం దాదాపు 90,147 మంది దరఖాస్తు చేశారు. గడచిని 24 గంటల్లో 58,245 దరఖాస్తులు అందినట్లు కమిసన్‌ తెల్పింది. కాగా ఇప్పటికే గ్రూప్‌ 1, 2, 3, 4 పోస్టులకు దరకాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే.

గ్రూప్‌ 1 పోస్టులకు అత్యధికంగా ఒక్కోపోస్టుకు (ప్రిలిమ్స్‌కు) 756 మంది పోటీపడగా.. అత్యల్పంగా గ్రూప్‌-4కు ఒక్కోపోస్టుకు కేవలం 116 మంది మాత్రమే పోటీపడుతున్నట్లు టీఎస్పీయస్సీ వెల్లడించింది. గ్రూప్‌-2, 3 సర్వీసుల పోస్టులకు దరఖాస్తు గడువు ముగియడంతో త్వరలో పరీక్ష తేదీలు త్వరలో వెల్లడించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.