Indiam Railways: రైల్వేశాఖలో 2.74 లక్షలకు పైగా ఉద్యోగాలు.. ఆ ఒక్క కేటగిరిలోనే 1.7 లక్షల ఖాళీలు

|

Jun 29, 2023 | 4:38 AM

భారత రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు దర్శనమిస్తున్నాయి. మొత్తంగా ఇన్ని విభాగాల్లో కలిపి 2 లక్షల 74 వేలకు పైగా పోస్టలు ఖాళీగా ఉన్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. మరో విషయం ఏంటంటే ఒక్క సెఫ్టీ కేటగిరీలోనే 1.7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ రైల్వేశాఖలో ఉన్న ఖాళీలపై వచ్చిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

Indiam Railways:  రైల్వేశాఖలో 2.74 లక్షలకు పైగా ఉద్యోగాలు.. ఆ ఒక్క కేటగిరిలోనే 1.7 లక్షల ఖాళీలు
Indian Railways
Follow us on

భారత రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు దర్శనమిస్తున్నాయి. మొత్తంగా ఇన్ని విభాగాల్లో కలిపి 2 లక్షల 74 వేలకు పైగా పోస్టలు ఖాళీగా ఉన్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. మరో విషయం ఏంటంటే ఒక్క సెఫ్టీ కేటగిరీలోనే 1.7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ రైల్వేశాఖలో ఉన్న ఖాళీలపై వచ్చిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. గ్రూప్ సీ కేటగిరీలో 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు.. భద్రతకు సంబంధించిన కేటగిరీలోనే 1,77,924 ఖాళీలు ఉన్నట్లు వివరించింది. ఈ ఏడాది జూన్ 1వ తేది నాటికి భద్రత కేటగిరీలో 9,82,037 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. కానీ 8,04,113 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు పేర్కొంది.

ఇదిలా ఉండగా రైల్వేశాఖలో మొత్తంగా 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని 2022 డిసెంబర్‌లోనే కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అయితే 2023 అక్టోబర్ వచ్చేసరికి 1.52 లక్షల పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1.38 లక్షల అభ్యర్థులకు నియామక పత్రాలు అందిచామని పేర్కొన్నారు. అలాగే వీరిలో 90 వేల మంది ఉద్యోగంలో చేరారని.. అలాగే ఇందులో 90 శాతం భద్రత కేటగిరీకి చెందినవేనని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.