TET 2025 Exam Date: టెట్‌కు ఊహించని స్పందన.. భారీగా పెరిగిన దరఖాస్తులు! మరో 10 రోజుల్లోనే..
AP TET 2025 Online application process closed: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2025కు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఆదివారం (నవంబర్ 23)తో ముగిసింది. అయితే దరఖాస్తు గడువు ముగింపు సమయం నాటికి టెట్ దరఖాస్తులు భారీగా పెరిగాయి. అత్యధికంగా మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. టెట్ దరఖాస్తుకు నవంబరు 23వ తేదీ సాయంత్రం..

అమరావతి, నవంబర్ 24: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2025కు ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఆదివారం (నవంబర్ 23)తో ముగిసింది. అయితే దరఖాస్తు గడువు ముగింపు సమయం నాటికి టెట్ దరఖాస్తులు భారీగా పెరిగాయి. అత్యధికంగా మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. టెట్ దరఖాస్తుకు నవంబరు 23వ తేదీ సాయంత్రం వరకు మొత్తం 2,58,638 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో మహిళా అభ్యర్థులు 1,67,668 మంది ఉండగా, పురుష అభ్యర్థులు 90,970 మంది ఉన్నారు. మొత్తం దరఖాస్తుల్లో దాదాపు 65 శాతం మంది మహిలా అభ్యర్ధులే ఉండటం విశేషం. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)కి నిర్వహించే పేపర్1ఏ కు 1,01,882 మంది, స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించే పేపర్ 2ఏ కు 1,51,220 మంది దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
మరోవైపు వివాదాల నడుమ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్‌ను రాయాలని రాష్ట్రంలోని వేలాది మంది టీచర్లు నిర్ణయం తీసుకున్నట్లు తాజా పరిణామాల వల్ల తెలుస్తుంది. నిన్న ముగిసిన టెట్ దరఖాస్తుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 32 వేల మందికి పైగా ఇన్‌సర్వీసు టీచర్లు టెట్‌కు దరఖాస్తు చేశారు మరీ. మొత్తం 32,016 మంది ఇన్‌సర్వీస్ టీచర్లు దరఖాస్తు చేశారు. ఇన్‌సర్వీసు టీచర్లకు కూడా టెట్ తప్పనిసరని పేర్కొంటూ సుప్రీంకోర్టు గత సెప్టెంబరులో ఇచ్చిన తీర్పుపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. దీంతో టెట్ నుంచి మినహాయింపు లభిస్తుందని దేశవ్యాప్తంగా టీచర్లు ఎదురుచూస్తున్నా.. ఎందుకైనా మంచిదనీ ఏపీలోని టీచర్లు మాత్రం సెకండ్ ఆప్షన్‌గా ముందుగానే టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో టెట్ దరఖాస్తులు సంఖ్య భారీగా పెరిగింది. అయితే రెండేళ్లలో టెట్ పరీక్ష క్లియర్ చేస్తామా? లేదా? అనే సందేహం గురువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది.
ఇక వచ్చే నెల నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 10 నుంచి రోజుకు 2 షిఫ్టుల్లో టెట్ ఆన్‌లైన్ రాత పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటలకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్ పరీక్షలు జరుగుతాయని ఏపీ టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇక టెట్ ఫలితాలను జనవరి 19వ తేదీన వెల్లడిస్తామని తెలిపారు. కాగా, వచ్చే ఏడాది 2 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్రప్రభుత్వం.. గత నెల టెట్ నోటిఫికేషన్ జారీచేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







