EPFO: ఈ వారంలోనే మీ EPF ఖాతాలో వడ్డీ జమ.. ఈజీగా బ్యాలెన్స్ చెక్ చేయండిలా!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు శుభవార్త! 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25 శాతం వడ్డీ ఈ వారంలో మీ EPF ఖాతాలకు జమ అవుతుంది. కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే 32.39 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమైందని ఆయన చెప్పారు. మిగిలిన ఖాతాల్లో ఈ వారం చివరిలోగా జమ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన అన్నారు. మీ EPF బ్యాలెన్స్, వడ్డీ జమ వివరాలు తెలుసుకోవడానికి నాలుగు సులువైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు శుభవార్త! 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.25 శాతం వడ్డీ ఈ వారంలో మీ EPF ఖాతాలకు జమ అవుతుంది. కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే 32.39 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమైందని ఆయన చెప్పారు. మిగిలిన ఖాతాల్లో ఈ వారం చివరిలోగా జమ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన అన్నారు.
EPF బ్యాలెన్స్ చూడాలంటే..
ఈపీఎఫ్ ఇతర పొదుపు సాధనాలతో పోలిస్తే మంచి రాబడి ఇస్తూ, దీర్ఘకాలిక పదవీ విరమణ నిధికి తోడ్పడుతుంది. మీ EPF బ్యాలెన్స్, వడ్డీ జమ వివరాలు తెలుసుకోవడానికి నాలుగు సులువైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:
EPFO పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో:
EPFO వెబ్‌సైట్‌కు వెళ్లండి.
“Our Services” విభాగంలో “For Employees” ఎంచుకోండి.
“Member Passbook” నొక్కండి.
మీ UAN నంబరు, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
మీ PF ఖాతా బ్యాలెన్స్ చూడటానికి సంబంధిత “Member ID”ని ఎంచుకోండి.
UMANG యాప్ ద్వారా:
UMANG యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
“All Services” నుండి “EPFO”ని ఎంచుకోండి.
“Employee Centric Services” లో “View Passbook” క్లిక్ చేసి మీ PF బ్యాలెన్స్ చూడండి.
మిస్డ్ కాల్ ద్వారా:
మీ UAN కు మొబైల్ నంబరు అనుసంధానం అయి ఉండాలి. బ్యాంక్ ఖాతా, ఆధార్, పాన్ వాటిలో ఏదో ఒకటి UAN తో అనుసంధానం అయి ఉండాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
రెండు రింగ్‌ల తర్వాత కాల్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. మీకు ఎస్ఎంఎస్ ద్వారా బ్యాలెన్స్ వివరాలు వస్తాయి.
ఎస్ఎంఎస్ ద్వారా:
మీ UAN యాక్టివేట్ అయి, ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 కు EPFOHO UAN LAN ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపండి. (LAN అంటే మీకు కావాల్సిన భాష మొదటి మూడు అక్షరాలు, ఉదాహరణకు English కు ENG, హిందీకి HIN).
మీరు వెంటనే PF బ్యాలెన్స్ వివరాలు పొందుతారు.
ఇలా మీ EPF బ్యాలెన్స్ సులభంగా తెలుసుకోవచ్చు.




