Xiaomi: బిల్ గేట్స్ విడాకుల విషయాన్ని ఎగతాళి చేస్తూ షియోమి కంపెనీ చెత్త ట్వీట్..ఏకి పారేస్తున్న జనాలు!
Xiaomi mobiles: మొబైల్ కంపెనీ షియోమి ఒక చెత్త ట్వీట్ చేసింది. షియోమి తన యూకే ట్విట్టర్ హ్యండిల్లో తన ఎంఐ 11 ఫాస్ట్ చార్జింగ్ గురించి ప్రచారం చేయబోయి అభాసుపాలైంది.
Xiaomi mobiles: మొబైల్ కంపెనీ షియోమి ఒక చెత్త ట్వీట్ చేసింది. షియోమి తన యూకే ట్విట్టర్ హ్యండిల్లో తన ఎంఐ 11 ఫాస్ట్ చార్జింగ్ గురించి ప్రచారం చేయబోయి అభాసుపాలైంది. తన ప్రచారం కోసం బిల్ గేట్స్ విడాకుల నిర్ణయాన్ని వాడుకోవడమే ఇందుకు కారణం. తన ప్రచారం కోసం ఒక వ్యక్తి ప్రైవేట్ వ్యవహారాన్ని వాడుకున్న ఎంఐ తరువాత తన తప్పు తెలుసుకుని ఆ ట్వీట్ ను తొలగించింది. కానీ, ఈలోపునే ఆ ట్వీట్ విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ ట్వీట్ స్క్రీన్ షాట్స్ వైరల్ గా మారాయి. అసలు ఆ ట్వీట్ లో ఏముందంటే..
“మీ బిలియనీర్ భాగస్వామితో విడిపోవటం అంత తెలివైన ఎంపిక కాకపోవచ్చు.. 55 నిమిషాల వైర్డ్ టర్బోచార్జింగ్ ఉపయోగించి 45 నిమిషాల్లో మా ఎంఐ 11 పూర్తిగా ఛార్జ్ చేసే ఎంపిక అంటే మీరు ఎల్లప్పుడూ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు.” ఇందులో ఉన్న విషయం పక్కన పెడితే.. ఈ ట్వీట్ ఐ ఫోన్ నుంచి పంపించారు. అంటే, తన ప్రత్యర్ధి బ్రాండ్ ఫోన్ నుంచి ఎంఐ 11 ఫోన్ ప్రధాన వేగవంతమైన చార్జింగ్ సామర్ధ్యాల గురించి చెపుతూ అందులో బిల్ గేట్స్ విడాకుల ప్రస్తావన తీసుకురావడం చాలా చెత్త వ్యవహారంగా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. విడాకులు అనేవి బిల్ గేట్స్, మెలిందా గేట్స్ ప్రయివేట్ వ్యవహారం దీనిని ఇలా ప్రచారంలో వాడుతూ అపహాస్యం చేయడం షియోమీ కంపెనీ నీచ మైన విధానాన్ని చూపిస్తోంది అని అంటున్నారు. అయితే, ఈ విషయంలోని సున్నితత్వాన్ని గ్రహించిన షియోమి ట్వీట్‌ను తొలగించింది.
ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ ఇదే!
కొంతకాలం క్రితం ఇలాంటి సంఘటనలో, షియోమి మలేషియాలో ఒక మోసగాడు తన భాగస్వామి నుండి వ్యభిచారం రహస్యంగా ఉంచడానికి Mi 9 SE ను ఉపయోగించాలని సూచించాడు. అలాగే ట్వీట్ ఐఫోన్ నుండి వచ్చింది. ఇలా రావడం ఇది మొదటిసారి కూడా కాదు. షియోమి అధినేత, లీ జున్ ఇటీవల సోషల్ మీడియా సందేశాలను పంపేటప్పుడు ఆపిల్ ఐఫోన్‌ను ఉపయోగించి పట్టుబడ్డాడు. ట్వీట్లు ఎక్కడ నుండి వచ్చాయో చూపించడంలో ట్విట్టర్ చాలా పారదర్శకంగా ఉన్న ఈ రోజులలో షియోమీ ఇలా చేస్తుండటం ఆశ్చర్యకరం. బహుశా షియోమి యొక్క సోషల్ మీడియా బృందం అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
Also Read: Petrol-Diesel Rates Today: రన్ రాజా రన్ అంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు… మన నగరంలో మాత్రం ఇలా…