Xiaomi electric car: త్వరలో రోడ్లపైకి షియోమీ ఈవీ కార్లు..అద్దిరిపోయే ఫీచర్లతో దూసుకెళ్తోంది..!

| Edited By: Jyothi Gadda

Nov 17, 2023 | 10:02 AM

ఇక జియోమీ తీసుకొచ్చిన సరికొత్త ఎలక్ట్రిక్ కారు విశేషాలను పరిశీలించినట్టయితే..రెండు సంవత్సరాల పరిశోధన ప్రయత్నం తర్వాత తన మొదటి హై రేంజ్ సెడాన్ మోడల్ ఎస్ యు సెవెన్ ఎలక్ట్రిక్ కార్ ను విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో ప్రస్తుతం విడుదలైంది. 220 కిలోవాట్ బ్యాటరీతో 210 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో డ్యూయల్ మోటర్ కలిగి ఉన్న మొదటి మోడల్.. ఇక 495 కిలోవాట్ల బ్యాటరీతో 265 టాప్ స్పీడ్ తో ఫోర్ వీల్ డ్రైవ్ తో వస్తుంది మరో మోడల్... మొదటిది SU 7 PRO, రెండవది SU 7 MAX .

Xiaomi electric car: త్వరలో రోడ్లపైకి షియోమీ ఈవీ కార్లు..అద్దిరిపోయే ఫీచర్లతో దూసుకెళ్తోంది..!
Xiaomi Su7 Electric Car
Follow us on

ఇండియా మార్కెట్లో చైనా ఫోన్ల హవా కొనసాగుతుంది. అందులో మెజారిటీ వాటా జియోమి కంపెనీదే… తక్కువ బడ్జెట్లో అదిరిపోయే ఫీచర్స్ అందిస్తుంది ఈ కంపెనీ. లో రేంజ్, మిడ్ రేంజ్ కస్టమర్లు జియోమీ ఫోన్లను ఎక్కువగా కొంటూ ఉంటారు. ఇప్పుడు ఇదే కంపెనీ చైనాలో ఎలక్ట్రిక్ కార్లను కూడా తయారు చేస్తుంది. ఈరోజే తన మొదటి ఎలక్ట్రిక్ మోడల్ SU 7 చైనా మార్కెట్లో విడుదల చేసింది. అంచనాలకు తగ్గట్లుగానే బడ్జెట్లో హై అండ్ ఫీచర్స్ ని అందిస్తూ ఇప్పటికే చైనా మార్కెట్లో దుమ్ము దులుపుతున్న BYD ఎలక్ట్రిక్ కార్లకు సవాల్ విసురుతుంది. BYD మాదిరిగానే ఇండియా మార్కెట్ లోను తమ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల కోసం ఇండియన్ గవర్నమెంట్ కి లైసెన్స్ అప్లై చేసింది జియోమీ. వచ్చే ఏడాది చివరి నాటికి జియోమీ ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది.

ఇక జియోమీ తీసుకొచ్చిన సరికొత్త ఎలక్ట్రిక్ కారు విశేషాలను పరిశీలించినట్టయితే.. బీజింగ్ ఆటోమేటిక్ ఇండస్ట్రీ హోల్డింగ్ జియోమీ మదర్ కంపెనీ… రెండు సంవత్సరాల పరిశోధన ప్రయత్నం తర్వాత తన మొదటి హై రేంజ్ సెడాన్ మోడల్ ఎస్ యు సెవెన్ ఎలక్ట్రిక్ కార్ ను విడుదల చేసింది. ఇది రెండు వేరియంట్లలో ప్రస్తుతం విడుదలైంది. 220 కిలోవాట్ బ్యాటరీతో 210 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో డ్యూయల్ మోటర్ కలిగి ఉన్న మొదటి మోడల్.. ఇక 495 కిలోవాట్ల బ్యాటరీతో 265 టాప్ స్పీడ్ తో ఫోర్ వీల్ డ్రైవ్ తో వస్తుంది మరో మోడల్… మొదటిది SU 7 PRO, రెండవది SU 7 MAX .

ఈ రెండు కార్లు కూడా 3000 ఎమ్ ఎమ్ లాంగ్ వీల్ బేస్ ప్లాట్ ఫామ్ లో రూపొందించారు. వీల్ సైజ్ కూడా 19, 20 ఇంచులతో తయారు చేశారు. ఇది పేరుకు సడన్ మోడల్ అయినా.. 4997 ఎం ఎం పొడవు, 1963 ఎం ఎం వెడల్పుతో ఇండియాలో ఉన్న ఎస్సీ వీల కంటే పెద్దది. ఇక జియోమీ ఉపయోగిస్తున్న బ్యాటరీలు BYD కంపెనీ తయారు చేస్తున్నవే ఈ ఎలక్ట్రిక్ కార్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..