ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు

ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఎస్‌బీఐ బ్యాంక్. ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ రూల్‌ని తొలగిస్తున్నట్లు బుధవారం పేర్కొంది. తాజాగా ప్రకటన ప్రకారం ఎస్‌బీఐ ఖాతాదారులు తమ పొదుపు ఖాతాలలో కనీస నిల్వను..

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 11, 2020 | 6:34 PM

ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఎస్‌బీఐ బ్యాంక్. ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ రూల్‌ని తొలగిస్తున్నట్లు బుధవారం పేర్కొంది. తాజాగా చేసిన ప్రకటన ప్రకారం ఎస్‌బీఐ ఖాతాదారులు తమ పొదుపు ఖాతాలలో కనీస నిల్వను (మినిమమ్ బ్యాలెన్స్) పాటించాల్సిన అవసరం లేదట. దీంతో.. ఈ బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట లభించిందనే చెప్పాలి. అలాగే పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ రూల్ బ్యాంక్‌లో ఉన్న 4.51 కోట్ల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.

అలాగే ఎస్‌ఎంఎస్ ఛార్జీలను కూడా మాఫీ చేసింది. దీంతో.. ఎస్‌బీఐ ఖాతాదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రూరల్‌లో రూ.1000, సెమీ అర్బన్‌‌లో రూ.2 వేలు, మెట్రో సిటీలో రూ.3 వేలు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న నిబంధనలు ఉండేవి. ఇక నుంచి అవి ఉండబోవట. ఒకవేళ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే.. రూ.5 నుంచి రూ.15ల వరకూ ఛార్జీలను కూడా వసూలు చేయనుంది ఎస్‌బీఐ బ్యాంక్. కాగా.. అందులోనూ ఖాతాదారులకు కూడా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం పెద్ద తలనొప్పిగా ఉండేది. ఇప్పుడు ఈ నిబంధనను ఎత్తేయడం వారికి ఇది అతిపెద్ద శుభవార్తే అని చెప్పొచ్చు. మరోవైపు బుధవారం నుంచి ఎంసీఎల్ఆర్ రేట్లను, డిపాజిట్లపై స్టేట్ బ్యాంకు చెల్లించే వడ్డీరేట్లు తగ్గించింది.

Read More this also: లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..

టీడీపీ నేతల కారుపై దాడి.. చంద్రబాబు ఫైర్

వేలానికి మాజీ మంత్రి గంటా ఆస్తులు..

రాష్ట్రంలో కావాలనే టీడీపీ అల్లకల్లోలం సృష్టిస్తుంది

కోలీవుడ్‌లో కలకలం.. అనుష్క, రానాలకు పెద్ద చిక్కు