రూల్స్ బేఖాతర్.. రానా కపూర్ అప్పనంగా ఇచ్చిన రుణాలు.. రూ. 20 వేల కోట్లు !

ఎస్ బ్యాంక్ ఫ్రాడ్ పై దర్యాప్తు జరుపుతున్న ఈడీ అధికారులకు షాకింగ్ వాస్తవాలు తెలుస్తున్నాయి. ఈ బ్యాంకు మొత్తం ఎక్స్ పోజర్ (దాదాపు ఆషామాషీ లావాదేవీల సొమ్ము) రెండు లక్షల కోట్లకు పైగా కాగా.. ఇందులో నిరరర్థక ఆస్తుల తాలూకు సొమ్మే రూ. 42  వేల కోట్లని వెల్లడైంది.

రూల్స్ బేఖాతర్.. రానా కపూర్ అప్పనంగా ఇచ్చిన రుణాలు.. రూ. 20 వేల కోట్లు !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 11, 2020 | 5:51 PM

ఎస్ బ్యాంక్ ఫ్రాడ్ పై దర్యాప్తు జరుపుతున్న ఈడీ అధికారులకు షాకింగ్ వాస్తవాలు తెలుస్తున్నాయి. ఈ బ్యాంకు మొత్తం ఎక్స్ పోజర్ (దాదాపు ఆషామాషీ లావాదేవీల సొమ్ము) రెండు లక్షల కోట్లకు పైగా కాగా.. ఇందులో నిరరర్థక ఆస్తుల తాలూకు సొమ్మే రూ. 42  వేల కోట్లని వెల్లడైంది.

ఎన్ పీ ఏ లుగా మారిన ఈ సొమ్ములో రూ. 20 వేల కోట్లను కొన్ని కార్పొరేట్ సంస్థలకు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు రానా కపూర్ ఎలాంటి నిబంధనలనూ పాటించకుండానే మంజూరు చేసారని తెలిసింది. అంటే ఆయన ఆదేశాలపై సిబ్బంది ఈ సొమ్మును వాటికి బదలాయించారట. కాక్స్ అండ్ కింగ్స్ గ్రూప్, డీ హెచ్ ఎఫ్ ఎల్ గ్రూప్, సహానా గ్రూప్, రేడియస్ గ్రూప్ వంటివి వీటిలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకు నిర్దేశించిన గైడ్ లైన్స్ ని గానీ, రూల్స్ ని గానీ పాటించకుండా అన్నింటినీ అతిక్రమించి కపూర్ గారు తన ఇష్టం వఛ్చిన సంస్థలకు ఈ సొమ్మును రుణాలుగా ఇఛ్చినట్టు  తేలింది. పైగా తన భార్య, తన కూతుళ్ళ పేర పెట్టిన కొన్ని డొల్ల సంస్థలకు కూడా ఈ రుణాలు ‘వెళ్లాయి’.  ఈడీ అధికారులు గత సోమవారం  నుంచి ఇతని నివాసంలో స్వాధీనం చేసుకున్నఅనేక డాక్యుమెంట్ల ద్వారా ఈ విషయం వెల్లడైంది. అధికారులు ఇంకా వీటిని కూలంకషంగా పరిశీలిస్తున్నారు.