చెర్రీ, మనోజ్ కాంబోలో.. ఓ సూపర్ హిట్ మూవీ రీమేక్

రామ్ చరణ్, మంచు మనోజ్ ఇద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్‌ చిత్రంలో నటించబోతున్నారట. అది కూడా ఓ ఓల్డ్ సూపర్ హిట్‌ సినిమా అని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతుందట..

చెర్రీ, మనోజ్ కాంబోలో.. ఓ సూపర్ హిట్ మూవీ రీమేక్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 11, 2020 | 5:50 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ ఇద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్‌ చిత్రంలో నటించబోతున్నారట. అది కూడా ఓ ఓల్డ్ సూపర్ హిట్‌ సినిమా అని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతుందట.

రామ్ చరణ్, మంచు మనోజ్ చిన్నప్పటి నుంచీ స్నేహితులన్న విషయం తెలిసిందే. తాజాగా.. టాలీవుడ్‌లోకి మనోజ్ ‘అహాం బ్రహ్మాస్మి’ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టాడు రామ్ చరణ్. అయితే తాజాగా వీళ్లిద్దరు ఓ సినిమాలో కలిసి నటించబోతున్నారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందట.

అప్పట్లో చిరంజీవి, మోహన్ బాబు హీరోలుగా నటించిన ‘బిల్లా రంగా’ సినిమాను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనున్నట్టు సమాచారం. బిల్లా రంగాలో.. చిరు, మోహన్‌ బాబులు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాని కేయస్ఆర్‌దాస్ దర్శకత్వం వహించగా.. పింజల నాగేశ్వర రావు నిర్మించారు. అప్పట్లో ఈ సినిమా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు అప్పటివరకూ ఉన్న యాక్షన్‌ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రంలో.. చరణ్, మనోజ్‌లు వాళ్ల తండ్రుల పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అందులోనూ ప్రజెంట్ మల్టీస్టారర్‌ మూవీలు ట్రెండ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. దాదాపు అలా నటించిన చిత్రాలన్నీ హిట్ అవుతున్నాయి. ఇక ‘బిల్లా రంగా’ రీమేక్ విషయమై కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఈ రీమేక్ విషయమై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా ఈసినిమా రీమేక్ విషయమై ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే ఒకవేళ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే.. ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది చూడాలి. అలాగే ఈ సినిమాని చెర్రీ, మనోజ్‌లు సంయుక్తంగా తెరకెక్కించాలనుకుంటున్నారట.

Read More this also: లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..

టీడీపీ నేతల కారుపై దాడి.. చంద్రబాబు ఫైర్

వేలానికి మాజీ మంత్రి గంటా ఆస్తులు..

రాష్ట్రంలో కావాలనే టీడీపీ అల్లకల్లోలం సృష్టిస్తుంది

కోలీవుడ్‌లో కలకలం.. అనుష్క, రానాలకు పెద్ద చిక్కు