Business Idea : మహిళలు ఈ ఒక్క మెషీన్ కొనుక్కొని బిజినెస్ చేస్తే చాలు, నెలకు రూ. 1 లక్ష ఈజీగా సంపాదించే ఛాన్స్…
మహిళలు మీ ఖాళీ సమయంలో డబ్బు సంపాదించాలని కలలు కంటున్నారా, అయితే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకండి.
మహిళలు మీ ఖాళీ సమయంలో డబ్బు సంపాదించాలని కలలు కంటున్నారా, అయితే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఈ ఒక్క మెషిన్ కొనుక్కొని మీరు ఇంటి వద్ద నెలకు కనీసం ఒక లక్ష రూపాయల వరకు సంపాదించే వీలుంది. అలాంటి ఓ వ్యాపార ఐడియాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా సంవత్సరం పొడవునా మీరు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఈ మధ్యకాలంలో సాయంత్రం పూట రైస్ తినడం మానేయమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. రైస్ కు బదులుగా చపాతి పుల్కా వంటి లైట్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు దీన్ని ఒక వ్యాపార అవకాశం గా మార్చుకునే వీలుంది. మీరు చపాతి పుల్కా బిజినెస్ చేయడం ద్వారా సాయంకాలం పూట ఓ రెండు గంటలు కష్టపడితే చాలు రోజుకు కనీసం 5000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే చపాతీ పుల్కా చేయాలంటే చాలా సమయం పడుతుంది కదా అని మీరు ఆలోచించవచ్చు. కానీ ఆటోమేటిక్ చపాతి పుల్కా మేకింగ్ మిషన్ కొనుక్కొని మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. మీకు సమయము మానవ వనరులు రెండు మిగిలిపోతాయి అలా ఆదాయం ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది.
మనకు 50 వేల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు చపాతీ మేకింగ్ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. మీ వ్యాపార పెట్టుబడిని బట్టి చపాతి మిషను కొనుగోలు చేయవచ్చు. ఈ చపాతీ బిజినెస్ కోసం మంచి సెంటర్ లో షాప్ పెట్టుకుంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. అయితే ఈ చపాతి మేకింగ్ మిషన్ సామర్థ్యాన్ని బట్టి ధర ఉంటుంది. అంటే ఉదాహరణకు గంటకు 200 చపాతీలు చేసే మిషన్ ధర 50 వేలు ఉంటే గంటకు 1000 చపాతీలు చేసే మిషన్ ధర 5 లక్షలు ఉంటుంది. మీ బిజినెస్ సామర్థ్యాన్ని బట్టి మిషిన్ ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. చపాతీలకు కర్రీస్ కూడా సపరేట్ గా చేసుకోవాల్సి ఉంటుంది.
చపాతి పిండిలో జొన్నలు రాగులు వంటి ఇతర ధాన్యాల పిండులను కూడా కలిపి చపాతీలను తయారు చేయవచ్చు. వీటిని మల్టీ గ్రెయిన్ చపాతీలు అంటారు. వీటిని తినేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఒక్కో చపాతీ ధర 5 రూపాయలు నిర్ణయించినా, మీరో రోజుకు 1000 చపాతీలను విక్రయిస్తే కనీసం రూ. 5000 వరకూ సంపాదించవచ్చు. ఖర్చులు పోనూ మీకు రోజుకు 3000 వరకూ మిగిలే చాన్స్ ఉంది. ఈ లెక్కన 30 రోజుల పాటు సంపాదిస్తే 90 వేల నుంచి రూ. 1 లక్ష రూపాయల వరకూ సంపాదించే వీలుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి