Bank Account: మీ అకౌంట్ డీయాక్టివ్ అయ్యిందా ? అందులో ఉన్న డబ్బులను ఇలా విత్ డ్రా చేసుకోండి..

మీ అకౌంట్ డీయాక్టివ్ అయ్యిందని బాధపడుతున్నారా ? అయితే టెన్షన్ పడకండి. చాలా కాలంపాటు అకౌంట్ ఉపయోగించకపోతే అకౌంట్ డీయాక్టివేట్ అయిపోతుంది.

Bank Account: మీ అకౌంట్ డీయాక్టివ్ అయ్యిందా ? అందులో ఉన్న డబ్బులను ఇలా విత్ డ్రా చేసుకోండి..
Representative Image
Follow us
Rajitha Chanti

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 12, 2021 | 9:44 AM

మీ అకౌంట్ డీయాక్టివ్ అయ్యిందని బాధపడుతున్నారా ? అయితే టెన్షన్ పడకండి. చాలా కాలంపాటు అకౌంట్ ఉపయోగించకపోతే అకౌంట్ డీయాక్టివేట్ అయిపోతుంది. అందులో ఉన్న డబ్బులను ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం.

పలు బ్యాంకుల్లో అకౌంట్ కలిగిన వారు వారి ఖాతా నుంచి పది సంవత్సరాల పాటు ఎలాంటి ట్రాన్సక్షన్స్ జరగపోతే వారి అకౌంట్ ఆటోమేటిక్‏గా డీయాక్టివ్ అయిపోతుంది. దీంతో వారి ఖాతాలో ఉన్న అమౌంట్ మొత్తం అన్‏క్లెయిమ్డ్ అవుతుంది. 2019 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాంకుల్లో రూ.18,380 కోట్లు అన్‏క్లెయిమ్డ్ అయిన డబ్బు ఉంది. ఇక ఏదైనా బ్యాంకులో మీ అకౌంట్ డీయాక్టివేట్ అయి ఉంటే.. ముందుగా మీరు ఆ బ్రాంచుకు మెయిల్ పంపాల్సి ఉంటుంది. అన్‏యాక్టివ్‏లో ఉన్న అకౌంటను రీయాక్టివ్ చేయాలని కోరాలి. దీనికోసం మీరు మీ ఐడీ కార్డు, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. మెయిల్ పంపిన తర్వాత కొన్ని రోజులకు అకౌంట్ తిరిగి రీయాక్టివ్ అవుతుంది. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువవుతున్న క్రమంలో ఆన్‏లైన్‏లో కేవైసీ అప్‏డేట్ చేయకపోవచ్చు. ఇందుకోసం మీరు నేరుగా బ్యాంకుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక సీనియర్ సిటిజన్స్ అయితే డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా వారి అకౌంటును మళ్ళీ యాక్టివేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Also Read: ATM Charges : ఏటీఎం నుంచి డబ్బులు తీసేటప్పుడు ఈ విషయంపై ఫోకస్ పెట్టండి..తప్పు చేశారో బాదుడు తప్పదు !

Business News: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీ ఖాతాలోకి డబ్బులు వచ్చాయా లేదా అని ఇలా చెక్ చేయండి.