Budget 2023 expectations: బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు మరింత ప్రోత్సాహం! సీతమ్మ పద్దుపై కోటి ఆశలు.. నిపుణుల అంచనాలు ఇవి..
రానున్న బడ్జెట్ లో ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు ఏమైనా ప్రోత్సాహం ఉంటుందా లేదా అన్న అంశంపై ఆటో మొబైల్ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.
ప్రపంచం పరివర్తనం చెందుతోంది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం మరో ప్రత్యామ్నాయం వైపు పరుగులు పెడుతోంది. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం.. ఆకాశన్నంటున్న చమురు ధరలు వారికి ప్రత్యామ్నాయం తప్ప మరో ఆలోచనలేకుండా చేసింది. ఈ క్రమంలో అందరికీ అనువుగా కనిపిస్తున్న మంచి మార్గం ఎలక్ట్రిక్ వాహనాలు. ఇటీవల కాలంలఓ ఎలక్ట్రిక్ మొబిలిటీ అనే పదం చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే చాలా టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలు ఎలక్ట్రిక్ శ్రేణిలో మార్కెట్లోకి వచ్చాయి.
మన దేశంలో కూడా..
మన దేశంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. జూలై 2022 నాటికి భారతదేశంలో 13 లక్షల కంటే ఎక్కువ ఈవీలు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన ఆటోఎక్స్ పో 2023లో కూడా ఎక్కువ అన్ని కంపెనీలు తమ ఎలక్ట్రిక్ శ్రేణి వాహనాలనే ప్రదర్శించాయి. 2023 నాటికి మన దేశంలో 102 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలు, 2.9 మిలియన్ పబ్లిక్ సర్వీస్ స్టేషన్లు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో అటు తయారీదారులు, వినియోగదారులు ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఎందుకంటే రానున్న బడ్జెట్ లో ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు ఏమైనా ప్రోత్సాహం ఉంటుందా లేదా అన్న అంశంపై ఆటో మొబైల్ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.
నిపుణులు చెబుతున్నది ఇదే..
ఆటోమొబైల్ రంగం ఇటీవల కాలంలో అనేక హెచ్చు తగ్గులను ఎదుర్కొంటోంది. అయితే, ఇటీవల నిర్వహించిన కాంతర్ సర్వే ప్రకారం, వినియోగదారులు సంప్రదాయ అంతర్గత దహన ఇంజిన్‌ల (ICE) వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహన శ్రేణికి మారాల్సిన అవసరం ఉంది. దీనికి తయారీదారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలు అవసరం ఉంది. ప్రస్తుత బడ్జెట్ లో దీనికే పెద్ద ఎత్తన కేటాయింపులు జరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ దారులు ఆశిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు? ఓ సారి చూద్దాం..
జీఎస్టీ మినహాయింపులు.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహించాలనుకుంటే వాటిపై జీఎస్టీ తగ్గించాలి. వాహనాలు మరింత ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు సామర్థ్యాన్ని పెంచే అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే చాలా ఆటోమోటివ్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై పెట్టుబడి పెట్టేందుకు సుముఖంగా ఉన్నారు. వారికి కావాల్సిందల్లా కాస్త ప్రోత్సాహం. ముడి పదార్థాలపై కూడా జీఎస్టీని తగ్గించాలి.
మౌలిక వసతులు కల్పించాలి.. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పెంచడంతో పాటు వినియోగాన్ని కూడా అధికం చేయాలంటే చార్జింగ్ స్టేషన్ల ను నిర్మించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సొంత ఈవీ కార్లకంటే రెంటల్ వ్యవస్థను మెరుగుపర్చాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చార్జింగ్ హబ్ లు ఏర్పాటు చేయాలి.. రానున్న కాలంలో కర్బన ఉద్ఘారాలను నియంత్రించడనాకి దేశ వ్యాప్తంగా చార్జింగ్ హబ్ నెట్ వర్క్ ఏర్పాటు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ చార్జింగ్ సాంకేతికతను వీలైనంత త్వరగా అందుబాటులో తేవాలి. ఆ మేరకు బ్యాటరీలు, చార్జింగ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలి. అలాగే మరిన్ని ప్రోత్సాహకాలు, సడలింపులు కావాలని కోరుతున్నారు. తయారీదారులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..