
ఆధార్ అంటే భారతదేశంలోని నివాసితులు (ఎన్‌ఆర్‌ఐలతో సహా) అందుబాటులో ఉన్న 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఆధార్ నమోదు ప్రక్రియకు పది వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు, ఫోటోగ్రాఫ్‌లతో పాటు అవసరమైన జనాభా వివరాలను అందిస్తే ఆధార్‌ను కేటాయించారు. ముఖ్యంగా డీప్లికేషన్ ప్రక్రియ ద్వారా వ్యక్తుల ప్రత్యేక గుర్తింపును సులభతరం చేస్తుంది. అయితే అనేక ఆధార్ ప్రమాణీకరణ ప్రక్రియలకు మీరు మీ నమోదిత మొబైల్ నంబర్‌కు పంపే ఓటీపీను నమోదు చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ ఖాతాకు మీకు మాత్రమే యాక్సెస్ ఉందని నిర్ధారించుకోవడానికి ఇది సహాయపడుతుంది. అయితే ఆధార్ విషయంలో మొబైల్ నెంబర్ చాలా కీలకం. అయితే ఎన్‌ఆర్‌ఐలు ఆధార్‌ను పొందే సమయంలో ఇంటర్నేషనల్ మొబైల్ నెంబర్‌ను ఇవ్వవచ్చా? అనేది చాలా మందికి ఓ అనుమానంగా ఉంటుంది. ఈ విషయంలో గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
ఆధార్ కార్డ్‌లోని మీ మొబైల్ నంబర్ వివిధ రకాల ప్రభుత్వ, బ్యాంకింగ్, సామాజిక సేవలను యాక్సెస్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. మీరు ఆధార్ కోసం నమోదు చేసుకున్నప్పుడు లేదా మీరు మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసినప్పుడు మీ గుర్తింపును ధ్రువీకరించడానికి మొబైల్ నంబర్‌ను ఉపయోగించవచ్చు. ఇది మోసపూరిత రిజిస్ట్రేషన్‌లు మరియు అప్‌డేట్‌లను నిరోధించడంలో సహాయపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..