AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Tax: దుబాయ్ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకురావచ్చు? పన్ను రహిత నియమాలు ఏమిటి?

భారత్‌లో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారత్‌లో బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు ఉంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. అయితే విదేశాల నుంచి బంగారాన్ని భారత్‌కు తీసుకురావాలంటే ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలో బంగారం కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు. భారతీయులకు ఇదొక సంప్రదాయంగా మారుతోంది. ధంతేరస్, దీపావళి సమయంలో దేశంలోని బంగారం మార్కెట్‌లు మెరుస్తాయి..

Gold Tax: దుబాయ్ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకురావచ్చు? పన్ను రహిత నియమాలు ఏమిటి?
Gold Tax
Subhash Goud
|

Updated on: Nov 03, 2023 | 1:56 PM

Share

భారత్‌లో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. భారత్‌లో బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు ఉంటూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటుంది. అయితే విదేశాల నుంచి బంగారాన్ని భారత్‌కు తీసుకురావాలంటే ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలో బంగారం కొనడం శుభప్రదంగా పరిగణిస్తారు. భారతీయులకు ఇదొక సంప్రదాయంగా మారుతోంది. ధంతేరస్, దీపావళి సమయంలో దేశంలోని బంగారం మార్కెట్‌లు మెరుస్తాయి. ప్రజలు కొనుగోలు చేయడానికి పోటెత్తారు. ఈ రోజుల్లో బంగారం విలువ పెరుగుతున్న కారణంగా వార్తల్లో నిలుస్తోంది. భారత్‌లో బంగారం ధర 10 గ్రాములకు 60 వేల రూపాయలను దాటింది. ఇది మరింత పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఆరవ్ బులియన్ ప్రకారం భారత్‌లో 10 గ్రాముల బంగారం ధర 61,750 రూపాయలు ఉంది.

దుబాయ్‌లో బంగారం ధర ఎంత?

దుబాయ్‌లో బంగారం చౌకగా ఉంటుందని మీరు కూడా అనుకుంటే, దాని ధరను తనిఖీ చేసి, భారతదేశంలో విక్రయించబడుతున్న బంగారం ధరతో పోల్చి చూద్దాం. ప్రస్తుతం దుబాయ్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,240గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,228గా ఉంది. భారతదేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల రూపాయల కంటే ఎక్కువ. అంటే ఇండియాలో కంటే దుబాయ్‌లో బంగారం చౌకగా ఉంటుంది.

దుబాయ్‌ నుంచి భారతదేశానికి ఎంత బంగారం తీసుకురావచ్చు?

భారతదేశం నుంచి దుబాయ్ సందర్శించే వ్యక్తులు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వారు భారతదేశానికి బంగారాన్ని తీసుకువస్తారు. అయితే మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, దుబాయ్ నుండి భారతదేశానికి బంగారాన్ని తీసుకురావడానికి పరిమితి ఉంది. పరిమితికి మించి బంగారం తీసుకువస్తే పన్ను చెల్లించాల్సిందే. దుబాయ్ నుంచి భారత్‌కు బంగారాన్ని తీసుకురావడానికి డ్యూటీ ఫ్రీ లిమిట్ పురుషులకు 20 గ్రాములు, మహిళలకు 40 గ్రాములు మాత్రమే. ఇంతకంటే ఎక్కువ బంగారం తీసుకువస్తే భారీగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో పన్నులు విధిస్తారు?

భారతదేశంలో జీఎస్టీ, దిగుమతి సుంకం, వ్యవసాయ సెస్, టీడీఎస్‌ వంటి అనేక పన్నులు బంగారంపై విధింపు ఉంటుంది. దుబాయ్ నుండి బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి. మీరు దానిని అంతర్జాతీయ ధరలకు పొందడం. ఇది కాకుండా దుబాయ్ ప్రభుత్వం బంగారంపై 5 శాతం వ్యాట్‌ను విధిస్తుంది. దుబాయ్‌లో బంగారు బిస్కెట్లు లేదా ముడి పదార్థాలపై ఎలాంటి పన్ను లేదు. అయితే విదేశాల నుంచి బంగారం తీసుకురావాలనుకుంటే వాటి నియమాలు ఏమిటో ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకుంటే ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకుంటారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి