RBI: కాలబుల్-నాన్ కాలబుల్ ఎఫ్డీ అంటే ఏమిటి..? ఆర్బీఐ తీసుకున్న నిర్ణయమేంటి?
నాన్ కాలబుల్ ఎఫ్డీ అంటే.. కొంత మొత్తాన్ని ఫిక్సుడ్ డిపాజిట్ చేసిన తరువాత.. దానికి లాకింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ ఎఫ్డీని మెచ్యూరిటీ తేదీ కన్నా ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ విత్ డ్రా చేసుకోవడానికి వీలుపడదు. మరి ఏ రకమైన ఎఫ్డీకి ఎంత మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. నాన్ కాలబుల్ ఎఫ్డీకి అయితే కనీసం 15 లక్షల..
మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా అది అవసరమైన సందర్భంలో అక్కరకు రాకపోతే ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే ఎవరైనా సరే తమ దగ్గరున్న మొత్తాన్ని బ్యాంకుల్లో ఫిక్సుడ్ డిపాజిట్ చేస్తారు. అయితే బ్యాంకుల్లో దాచుకునే ఫిక్సుడ్ డిపాజిట్లు 2 రకాలుగా ఉంటాయి. బ్యాంక్ ఎఫ్డీ రకాలను చూస్తే.. ఒకటి కాలబుల్ ఎఫ్డీ. మరొకటి నాన్-కాలబుల్ ఎఫ్డీ.
కాలబుల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఏమిటి..?
కాలబుల్ ఎఫ్డీ అంటే ఒక వ్యక్తి కొంత మొత్తాన్ని ఫిక్సుడు డిపాజిట్ చేసిన తరువాత.. దానిని మెచ్యూరిటీ కన్నా ముందే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అలా చేసుకోవాలనుకుంటే.. దానికోసం కొన్ని ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు బ్యాంకు ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది.
నాన్ కాలబుల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఏమిటి..?
నాన్ కాలబుల్ ఎఫ్డీ అంటే.. కొంత మొత్తాన్ని ఫిక్సుడ్ డిపాజిట్ చేసిన తరువాత.. దానికి లాకింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే ఆ ఎఫ్డీని మెచ్యూరిటీ తేదీ కన్నా ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ విత్ డ్రా చేసుకోవడానికి వీలుపడదు. మరి ఏ రకమైన ఎఫ్డీకి ఎంత మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. నాన్ కాలబుల్ ఎఫ్డీకి అయితే కనీసం 15 లక్షల మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. అదే కాలబుల్ ఎఫ్డీకి అయితే ఈ మొత్తం కేవలం ఐదు వేల నుంచి 10 వేల రూపాయిలే ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. నాన్ కాలబుల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాన్ని పెంచింది. దీంతో కొంతమంది ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో తమ నగదును సేవ్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పుడు కాలబుల్, నాన్ కాలబుల్ ఎఫ్డీలను పరిశీలిస్తే.. నాన్ కాలబుల్ ఎఫ్డీలు.. కోటి రూపాయిలు లేదా అంతకన్నా తక్కువ మొత్తంలో ఉంటే.. వాటిని నిర్ణీత కాలానికన్నా ముందే విత్ డ్రా చేయవచ్చు. ఇక మామూలు ఎఫ్డీలతో పోలిస్తే.. నాన్ కాలబుల్ ఎఫ్డీలకు వడ్డీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. దీంతోపాటు ఇంట్రస్ట్ రేటు ఎప్పుడూ ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. అంటే మార్కెట్ ఒడిదొడుకులు, రిజర్వు బ్యాంక్ నిర్ణయాలు.. ఇలా ఏవీ దీనిని ప్రభావితం చేయవు. అంటే.. ఆ వడ్డీ రేటును మార్చవు. పైగా మీ మొత్తం బ్యాంకులో సురక్షితంగా ఉంటుంది. ఇందులో క్యాష్ లిక్విడిటీ ఉంటుంది. ఇలా కొంత మొత్తాన్ని ముందే సేవ్ చేస్తే.. అవసరమైన సందర్భంలో అది ఆదుకుంటుంది.
కాలబుల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ విషయానికొస్తే.. ఇందులో దాచుకునే మొత్తాన్ని అత్యవసర సందర్భంలో వెనక్కు తీసుకోవచ్చు. అంటే ఆ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. దీనివల్ల అవసరమైన సందర్భాల్లో ఆ మొత్తం ఉపయోగపడుతుంది. కాకపోతే ఇలాంటి ఎఫ్డీలకు వడ్డీ తక్కువగా ఉంటుంది. ఇక ఎలాంటి బ్యాంకులలో ఎఫ్డీలను డిపాజిట్ చేయాలా అని చాలామందికి అనుమానం ఉంటుంది. జాతీయ బ్యాంకుల్లో ఎలాగూ సమస్య ఉండదు. దీంతోపాటు AAA రేటింగ్ ఉన్న చిన్న బ్యాంకులు, లేదా సంస్థల్లో అయినా ఎఫ్డీలను చేయచ్చు. ఎఫ్డీని చేసే ముందు దానికి సంబంధించిన వివరాలను పూర్తిగా చెక్ చేసుకోవాలి. నియమ నిబంధనల గురించి తెలుసుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యా ఉండదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి