LIC Scheme: రోజుకు రూ. 60 పొదుపు చేస్తే రూ. 8 లక్షలు పొందొచ్చు.. ఈ స్కీమ్ మహిళల కోసమే
ఆధార్ శిలా యోజన పథకంలో 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసుగల మహిళలు చేరొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారి వయసు 70 ఏళ్లు వచ్చే వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో చేరాలనుకునే వారు స్థానికంగా ఉన్న ఎల్‌ఐసీ బ్రాంచ్‌ను లేదా ఎల్‌ఐసీ ఏజెంట్‌ను సంప్రదింవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ను...
ప్రముఖ జీవత బీమా సంస్థ ఎల్‌ఐసీ కేవలం జీవిత బీమానే కాకుండా ఎన్నో రకాల సేవింగ్స్ స్కీమ్స్ అందిస్తున్నాయి. చిన్న మొత్తంలో పెట్టుబడి పెడుతూ పెద్ద మొత్తంలో లాభం పొందే అవకాశం కల్పిస్తోంది. మరీ ముఖ్యంగా మహిళల కోసం ఇలాంటి ఎన్నో పథకాలను ఎల్‌ఐసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలాంటి పథకాల్లో ఒకటి ఆధార్ శిలా యోజన పథకం. ఇంతకీ ఏంటీ ఆధార్ శిలా యోజన పథకం, దీని బెనిఫిట్స్ ఏంటో తెలియాలంటే ఈ స్లోరీలోకి వెళ్లాల్సిందే..
ఆధార్ శిలా యోజన పథకంలో 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసుగల మహిళలు చేరొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారి వయసు 70 ఏళ్లు వచ్చే వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో చేరాలనుకునే వారు స్థానికంగా ఉన్న ఎల్‌ఐసీ బ్రాంచ్‌ను లేదా ఎల్‌ఐసీ ఏజెంట్‌ను సంప్రదింవచ్చు. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ను రోజువారీ, నెలవారీ, మూడు నెలలు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి లేదా ఏడాది ఒకసారి నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టొచ్చు.
ఈ పథకం ద్వారా కనీసం రూ. 75,000 నుంచి గరిష్టంగా రూ. 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకం మినిమం మెచ్యూరిటీ సమయం 10 ఏళ్లుగా ఉంటుంది. గరిష్టంగా 20 ఏళ్ల వరకు పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాత బోనస్‌తో కలిపి మొత్తం తిరిగి చెల్లిస్తారు. బోనస్ ఏడాదికి 4.5 శాతం వడ్డీ రేటుతో లెక్కిస్తారు. ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న ఓ మహిళ 20 ఏళ్ల పాటు పెటుబడితే ఎంత ఆదాయం పొందొచ్చే ఇప్పుడు చూద్దాం.
30 ఏళ్ల వయసున్న ఓ మహిళ ఉదాహరణకు రోజుకు సుమారు రూ. 60 పెట్టుబడి పెట్టారు అనుకుందాం. ఇలా 20 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మొత్తం దాదాపు రూ. 4 లక్షల 20 వేల వరకు పెట్టుబడిగా పెడతారు. ఇలా 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మెచ్యూరిటీ పీరియడ్ ముగియగానే.. సుమారు రూ. 8 లక్షలు పొందొచ్చు. పెట్టుబడిని ఆన్‌లైన్‌లో, లేదా ఎల్‌ఐసీ ఏజెంట్‌కు ఆఫ్‌లైన్ విధానంలో కూడా చెల్లించవచ్చు. మీ బడ్జెట్, ఆర్థిక లక్ష్యాల ఆధారంగా పెట్టుబడిని ఎంచుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..