Money Tips: ఒక్క రూపాయ్‌తో అక్షరాలా కోటి రూపాయలు.. రియల్ లైఫ్‌ డబుల్ జాక్‌పాట్ ఇది..

కనిపిస్తాయి కానీ కనిపించవు.. డబ్బులు ఉన్నట్లే అనిపిస్తాయి కానీ ఉండవు. చేత్తో తాకలేము, పర్సులో పెట్టుకోలేము. ఒక్క కాయిన్ సంపాదిస్తే, సాధిస్తే లైఫ్ సెటిల్..అంతే.. కన్ఫ్యూజింగ్ గా ఉన్నా క్రిప్టో కరెన్సీ అంటే ఇదే. క్రిప్టో వరల్డ్ లో బిట్ కాయిన్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. యస్‌. బిట్‌ కాయిన్‌...

Money Tips: ఒక్క రూపాయ్‌తో అక్షరాలా కోటి రూపాయలు.. రియల్ లైఫ్‌ డబుల్ జాక్‌పాట్ ఇది..
Money

Updated on: Jul 17, 2025 | 7:15 PM

రూపాయి పెట్టుబడితో కోటి రూపాయలు సంపాదించవచ్చు. ఇది రీల్‌ లైఫ్‌లోనే సాధ్యం. రియల్‌ లైఫ్‌లో మాత్రం కుదరదు. కానీ రియల్‌ లైఫ్‌లో కూడా ఒక్క రూపాయి. ఒకే ఒక్క రూపాయి. కోటి రూపాయలు అవుతుందని బిట్‌ కాయిన్‌ నిరూపించింది. 2010 టైమ్‌లో రూపాయి కాయిన్ ఇస్తే ఓ బిట్‌ కాయిన్‌ వచ్చేది. దాని విలువ ఇప్పుడు అక్షరాలా కోటి రూపాయలు దాటేసింది. అంటే పది రూపాయలు పెట్టి పది బిట్‌ కాయిన్లు కొంటే.. ఇప్పుడు మీ జేబులో 10 కోట్ల రూపాయలు ఉన్నట్లే!

క్రిప్టో వరల్డ్‌లో బిట్ కాయిన్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. యస్‌. బిట్‌ కాయిన్‌.. తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. అన్ని రికార్డులను చెరిపేసి దూసుకెళుతోంది. దాని రేటు లక్ష డాలర్లు దాటిపోయింది. అంటే ఒక బిట్‌ కాయిన్‌ మన దగ్గర ఉంటే లైఫ్‌ సెటిల్‌ అయిపోయినట్లే. అవే పదో వందో ఉంటే ఇక మనం మిలియనీర్లమే. డాలర్‌ కంటే తక్కువ విలువతో మొదలైన బిట్‌ కాయిన్‌ జర్నీ.. లక్ష డాలర్లు దాటి వెళ్లిపోయింది. బిట్‌ కాయిన్‌ రేటును కొన్ని అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. బిట్‌కాయిన్‌ రేటును సప్లయ్-డిమాండ్‌ ఫార్ములా ప్రభావితం చేస్తుంది. కొత్త బిట్‌ కాయిన్లు కావాలంటే, అవి అంత ఈజీగా పుట్టుకురావు. వాటిని డిజిటల్‌ ప్రింటింగ్‌ చేయలేరు. అత్యంత క్లిష్టమైన డిజిటల్‌ మైనింగ్‌ ప్రాసెస్‌తోనే బిట్ కాయిన్లు తయారవుతాయి. అయితే ప్రపంచంలో 21 మిలియన్‌ బిట్‌ కాయిన్లను మించి తయారు చేయలేరు. ఆ లిమిట్‌ ఫ్యాక్టర్‌ కూడా బిట్‌ కాయిన్‌ రేటు పెరగడం, తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

ఇక ఇతర క్రిప్టో కరెన్సీల నుంచి వచ్చే పోటీ కూడా బిట్‌కాయిన్‌ రేటును ప్రభావితం చేస్తుంటుంది. బిట్‌ కాయిన్‌ సప్లయ్‌ కూడా బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీతో కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ ప్రకారమే జరుగుతుంది. ఆ ప్రోగ్రామింగ్‌ ప్రకారం, నాలుగేళ్లకోసారి కొత్త బిట్‌ కాయిన్లు తయారు చేయబడి మార్కెట్‌లోకి వస్తాయి. దీంతో బిట్‌ కాయిన్‌ రేటు నాలుగేళ్లకోసారి సగానికి సగం పడిపోతుంది. కొత్త బిట్‌ కాయిన్లు మార్కెట్‌లోకి వచ్చిన సంఖ్యను బట్టి, దాని రేటును అడ్జస్ట్‌ చేస్తారు. గోల్డ్, స్టాక్స్ కంటే ఈ బిట్‌కాయిన్ మంచి రాబడి ఇస్తుండటంతో.. భారత ఇన్వెస్టర్లు ఇప్పుడు దీనిపై కన్నేశారు. ప్రస్తుతం బిట్‌కాయిన్‌లో బుల్ ర్యాలీ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు క్యూ కట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..