AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాకర్‌లో దాచుకున్న బంగారం లేదా విలువైన వస్తువులు పోతే.. బ్యాంక్‌లు పరిహారం చెల్లిస్తాయా?

బెంగళూరులోని SBI లాకర్ నుండి 145 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలు మాయమైన ఘటనపై, RBI మార్గదర్శకాల ప్రకారం బ్యాంకుల బాధ్యతను వివరిస్తుంది ఈ ఆర్టికల్. లాకర్ లోపల ఏముందో బ్యాంకులు తెలుసుకోకూడదు, కానీ ట్యాంపరింగ్ జరిగితే పరిహారం చెల్లించాలి. వార్షిక అద్దెకు 100 రెట్లు వరకు పరిహారం లభిస్తుంది.

లాకర్‌లో దాచుకున్న బంగారం లేదా విలువైన వస్తువులు పోతే.. బ్యాంక్‌లు పరిహారం చెల్లిస్తాయా?
Bank Locker
SN Pasha
|

Updated on: Sep 22, 2025 | 12:28 PM

Share

బెంగళూరులో ఒక మహిళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాకర్‌లో నిల్వ చేసిన 145 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలు మాయమయ్యాయి. దీనిపై ఆమె బ్యాంకుకు ఫిర్యాదు చేసి పరిహారం కోరింది. మరి బ్యాంక్‌ పరిహారం చెల్లించిందా? అసలు రూల్స్‌ మేం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. బ్యాంక్ లాకర్ సౌకర్యాలకు సంబంధించిన చట్టాలు, నియమాలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. 2021లో RBI ఈ విషయంపై నిబంధనలను జారీ చేసింది.

బ్యాంకులు కస్టమర్ లాకర్‌లో నిల్వ చేసిన వస్తువుల రికార్డులను ఉంచకూడదు, అలాగే లోపల ఏమి ఉంచారో విచారించే హక్కు కూడా వారికి లేదు. అయితే ట్యాంపరింగ్ లేదా దొంగతనం జరిగిన సందర్భాల్లో బ్యాంకు బాధ్యత వహించాలి. బ్యాంకు నిర్లక్ష్యం లేదా తప్పు కారణంగా ఏదైనా నష్టం జరిగినా, వస్తువులు చోరీకి గురైనా కస్టమర్‌కు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకుపై ఉంటుంది.

బ్యాంకు ఎంత పరిహారం ఇస్తుంది..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా నష్టం జరిగితే, బ్యాంకు వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు లాకర్ అద్దె ఏడాదికి రూ.3,000 అయితే, బ్యాంకు అందించగల గరిష్ట పరిహారం రూ.3,00,000.

బ్యాంకు పరిహారం చెల్లించనప్పుడు

లాకర్ నుండి దొంగతనం జరిగి, బ్యాంకు తప్పు లేదా నిర్లక్ష్యం నిరూపణ కాకుంటే బ్యాంక్‌ బాధ్యత వహించదు. బ్యాంకు అటువంటి సంఘటనలను దర్యాప్తు చేస్తుంది. దాని వైపు నుండి ఎటువంటి నిర్లక్ష్యం నిరూపణ కాకుటే బ్యాంక్‌ ఎటువంటి పరిహారం చెల్లించదు.

బ్యాంక్ లాకర్ ట్యాంపరింగ్‌ జరిగే ఏం చేయాలి?

  • వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
  • బ్యాంకుకు లిఖితపూర్వక ఫిర్యాదును సమర్పించాలి.
  • లాకర్ ప్రాంతంలోని CCTV ఫుటేజ్‌లను అందించమని బ్యాంకును అభ్యర్థించాలి.
  • బ్యాంకు ప్రతిస్పందన సంతృప్తికరంగా లేకుంటే, RBI బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయాలి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి