Gold Purchase: బంగారం కొనుగోలుపైనా పరిమితులున్నాయా? ఆధార్, పాన్ కార్డు ఎప్పుడు అడుగుతారు? పూర్తి వివరాలు ఇవి..
వాస్తవానికి మీరు ఎంత మొత్తం వెచ్చించి అయినా కూడా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. నగదును ఎంతైనా చెల్లించి బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. అయితే అమ్మకం దారుడికి మాత్రం ఆదాయ పన్నుల శాఖ కొన్ని పరిమితులు విధించింది. ఆదాయ పన్నుల చట్టం ప్రకారం ఒకే లావాదేవీకి సంబంధించి రెండు లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరించడానికి గ్రహీతపై పరిమితులు ఉన్నాయి.

మన దేశంలో బంగారానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఏ శుభ కార్యమైనా బంగారం ఉండాల్సిందే. కాస్త నగదు నిల్వ ఉంటే వెంటనే బంగారం కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతారు. అయితే ఆ బంగారం కొనుగోలు కూడా పరిమితులుంటాయని చాలా మందికి తెలీదు. అందుకోసం ఆదాయ పన్ను శాఖ కొన్ని నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలు ఏంటి? పరిమితులు ఎలా ఉంటాయి? ఎంత మొత్తంలో బంగారానికి మీరు ఖర్చు పెట్టొచ్చు. ఆధార్ లేదా పాన్ కార్డు ఎప్పుడు సమర్పించాలి? తెలుసుకుందాం రండి..
మీరు కొనుగోలు చేయొచ్చు.. కానీ వారు అమ్మలేరు..
వాస్తవానికి మీరు ఎంత మొత్తం వెచ్చించి అయినా కూడా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. నగదును ఎంతైనా చెల్లించి బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. అయితే అమ్మకం దారుడికి మాత్రం ఆదాయ పన్నుల శాఖ కొన్ని పరిమితులు విధించింది. ఆదాయ పన్నుల చట్టం ప్రకారం ఒకే లావాదేవీకి సంబంధించి రెండు లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ నగదును స్వీకరించడానికి గ్రహీతపై పరిమితులు ఉన్నాయి. కాబట్టి మీరు బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎంత మొత్తాన్ని చెల్లించగలిగినప్పటికీ, ఆభరణాలు ప్రతి లావాదేవీకి సంబంధించి రెండు లక్షల రూపాయలు, అంతకంటే ఎక్కువ నగదును అంగీకరించవు. ఎందుకంటే ఆభరణాల విక్రయం, ప్రతి లావాదేవీకి రెండు లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని స్వీకరించకుండా చట్టం నిషేధిస్తుంది.
పరిమితికి మించితే..
నగలకు సంబంధించి రెండు లక్షల రూపాయలకు మించి నగదును స్వీకరిస్తే, ఆదాయపు పన్ను శాఖ చట్టపరమైన నిబంధనలకు విరుద్ధంగా అంగీకరించిన మొత్తానికి సమానమైన జరిమానా విధించే అధికారం ఆదాయ పన్నుల శాఖకు ఉంటుంది.
మరేం చేయాలి..
మీరు నగదు ద్వారా లేదా మరేదైనా రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఆభరణాల వ్యాపారి నుంచి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లయితే, మీరు పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ వంటి మీ గుర్తింపును విక్రేతకు అందించాలి . అప్పుడు మీరు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు రూ. 2 లక్షల లోపు బిల్లులకు అయితే పాన్ లేదా ఆధార్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఇది బెస్ట్ ఆప్షన్..
మీరు మీ పిల్లల పెళ్లికి బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే సంవత్సరాల తరబడి మంచి రాబడిని పొందడంలో మీకు సహాయపడే సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ)లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఎస్జీబీలో పెట్టుబడిపై ప్రతి సంవత్సరం 2.50% వడ్డీని పొందుతారు. అంతేకాకుండా, ఎస్జీబీ రీడీమ్ చేసినప్పుడు ఎలాంటి చార్జీలు వర్తించవు. సాధారణంగా ఎలక్ట్రానిక్ బంగారం ఇతర ప్రయోజనాలతో పాటు, మీరు భౌతిక బంగారం కొనుగోలు సమయంలో జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్జీబీని కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది అన్ని రకాలుగా దీర్ఘకాలిక ప్రయోజనాలు అందిస్తుంది. వినియోగదారుడికి మేలు చేకూరుస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..