- Telugu News Photo Gallery Business photos These are the top selling cars in august 2023, check out list
Top Selling cars: మారుతీ సుజుకీ కార్లకు తిరుగులేదు.. ఆగస్టులో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..
ఇటీవల కాలంలో ఎస్‌యూవీ వేరియంట్ కార్ల కొనుగోళ్లు పెరుగుతున్నప్పటికీ.. సాధారణ మోడళ్లకు కూడా అంతే స్థాయిలో డిమాండ్ ఉంటోంది. ఈ ఏడాది ఆగస్టులో అమ్ముడైన వాహనాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. అయితే ఎప్పటిలాగే అత్యధిక అమ్మకాలు చేసిన కార్ల జాబితాలో మారుతీ సుజుకీ కార్లే ఉన్నాయి. మొదటి స్థానం మాత్రమే కాదు టాప్ మూడు స్థానాలు కూడా మారుతీ సుజుకీ కార్లే ఉన్నాయంటే మన దేశంలో ఈ కంపెనీ కార్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 2023 ఆగస్టులో అత్యధిక సంఖ్యలో అమ్ముడైన టాప్ 5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి చిన్నగా ఉండటంతో పాటు పార్కింగ్ స్థలాన్ని కూడా చాలా తక్కువ ఆక్యుపై చేస్తుంది.
Updated on: Sep 25, 2023 | 7:30 AM

మారుతీ సుజుకి స్విఫ్ట్.. ఆగస్ట్ 2023లో అత్యధికంగా అమ్ముడైన కారు మారుతి సుజుకి స్విఫ్ట్, ఇది హ్యాచ్‌బ్యాక్‌ల విక్రయాలలో కూడా ముందుంది. గత నెలలో 18,653 యూనిట్ల స్విఫ్ట్‌లను విక్రయించి, 65 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆగస్ట్ 2022లో మారుతి సుజుకి 11,275 యూనిట్ల స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లను విక్రయించింది.

మారుతీ సుజుకి బాలెనో.. ఆగస్ట్ 2023లో అత్యధికంగా అమ్ముడైన రెండో హ్యాచ్‌బ్యాక్ మారుతి సుజుకి బాలెనో. ఇది మాన్యువల్ లేదా ఎంఎంటీ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీనిలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ కార్‌మేకర్ గత నెలలో 18,516 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది ఆగస్టులో 18,418 యూనిట్లను విక్రయించి, 1 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్.. ఆగస్ట్ 2023లో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌ల జాబితాలో మారుతి సుజుకి వాగన్ ఆర్ మూడో స్థానాన్ని ఆక్రమించింది. గత నెలలో 15,578 యూనిట్లను విక్రయించింది. అయితే కార్‌మేకర్ ఆగస్ట్ 2022లో 18,398 యూనిట్లను విక్రయించింది. అంటే 15 శాతం క్షీణించింది.

మారుతీ సుజుకి ఆల్టో.. భారతదేశంలో ఒకప్పుడు అత్యధికంగా అమ్ముడైన కారు ఆగస్ట్‌లో 15వ బెస్ట్ సెల్లర్‌గా ఉంది. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్‌లలో నాల్గవది. మారుతి సుజుకి 2023 ఆగస్టులో 9,603 ఆల్టో యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఆగస్టులో 14,388 యూనిట్లను విక్రయించింది. ఫలితంగా 33 శాతం క్షీణతను నమోదు చేసింది.

టాటా టియాగో.. ఆగస్ట్ 2023లో అత్యధికంగా అమ్ముడైన ఐదో హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో, ఇది ఐసీఈ, ఈవీ వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ కార్ మేకర్ 9,463 యూనిట్ల హ్యాచ్‌బ్యాక్‌లను విక్రయించింది. ఆగస్టు 2022లో 7,209 యూనిట్లను విక్రయించి, 31 శాతం వృద్ధిని నమోదు చేసింది.




