AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Retirement Income: ఆ జాగ్రత్తలతో రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భరోసా.. పెట్టుబడిపై నిపుణుల సూచనలివే..!

భారతదేశంలో ఇటీవల కాలంలో ప్రైవేట్ రంగంలో పని చేసే ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా అనేది అందని ద్రాక్షగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందాన సంపాదన ఉన్నప్పుడే రిటైర్‌మెంట్ జీవితం గురించి ఆలోచించి పదవీ విరమణ పథకాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

Post Retirement Income: ఆ జాగ్రత్తలతో రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థిక భరోసా.. పెట్టుబడిపై నిపుణుల సూచనలివే..!
Post Retirement Income
Nikhil
|

Updated on: Apr 06, 2025 | 2:00 PM

Share

ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులతో పాటు వ్యవస్థాపక సంస్థలలో ఉన్న వారికి హామీతో కూడా పెన్షన్లు కొరతగా మారుతున్నందున కచ్చితంగా పదవీ విరమణ పథకాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. 2050 నాటికి భారతదేశంలో పురుషులు, మహిళలు 75 నుంచి 80 సంవత్సరాలకు పైబడే జీవిస్తారని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అంటే మీరు రిటైర్ అయ్యాక కూడా 15 నుంచి 20 సంవత్సరాల ప్రణాళికతో పెట్టుబడులు పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిపై నిపుణుల సూచనలను ఓ సారి తెలుసుకుందాం. 

పదవీ విరమణ తర్వాత ఆదాయ వ్యూహానికి పునాదిగా పునరావృత ఖర్చులను అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యమైన నెలవారీ ఖర్చులతో లెక్కలు వేయడంతో పాటు త్రైమాసిక, వార్షిక ఖర్చులు అంటే ఆరోగ్య పరీక్షలు, ఆస్తి పన్నులు, బీమా పునరుద్ధరణ వంటి ఖర్చులు పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ప్రయాణం, వినోదంతో పాటు గృహ పునరుద్ధరణలు వంటి ఖర్చులను బేరీజు వేసుకోవాలని సూచిస్తున్నారు. ఆయా ఖర్చులను పరిగణలోకి తీసుకున్న తర్వాత 20 ఏళ్ల రాబడిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.  మీరు ఇప్పుడు ఉన్న జీవనశైలిని రిటైర్ అయ్యాక కూడా నిర్వహించాలంటే రిస్క్, రాబడిని సమతుల్యం చేసే స్మార్ట్ పెట్టుబడులతో సులభం అవుతుందని చెబుతున్నారు. 

ముఖ్యంగా ష్యూరిటీకి ప్రాధాన్యత ఇవ్వాలనుకునే పెట్టుబడిదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లతో కలిపి యాన్యుటీల మిశ్రమానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చని చెబుతున్నారు. అయితే ఈ ఎంపిక తక్కువ తులనాత్మక రాబడిని అందిస్తుందని, ప్రిన్సిపల్ పరిరక్షణకు గణనీయమైన ముప్పు కలిగించే రేట్ల వద్ద పరిపక్వ డిపాజిట్లను తిరిగి పెట్టుబడి పెట్టే ప్రమాదాన్ని కలిగి ఉంటుందని గమనించాలి. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌లు అంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్, ఆర్బిట్రేజ్ ఫండ్స్, మల్టీ అసెట్, హైబ్రిడ్ ఈక్విటీ పథకాల్లో పెట్టుబడితో తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడిని పొందవచ్చని చెబుతున్నారు. మీ పదవీ విరమణ ప్రణాళికలో అక్యుములేషన్ దశ చాల కీలకంగా ఉంటుంది. డీఅక్యుమ్యులేషన్ దశలో పదవీ విరమణ ఉపసంహరణలను ఆప్టిమైజ్ చేయడం చాలా కీలకం అని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే పౌరులు పన్ను సమర్థవంతమైన ఉపసంహరణ విధానం ఎంచుకోవడం చాలా కీలకం అని నిపుణులు చెబుతున్నారు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఎన్‌పీఎస్ నుంచి వరుసగా ఉపసంహరణలు పన్ను ప్రయోజనాలను విస్తరించడానికి సహాయపడవచ్చు. తక్కువ మూలధన లాభాల పన్ను ప్రయోజనాన్ని పొందడానికి పన్ను-సమర్థవంతమైన ఈక్విటీ-ఆధారిత మ్యూచువల్ ఫండ్ల నుంచి నిర్మాణ ఉపసంహరణలు సమర్థవంతంగా మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలని సూచిస్తున్నారు. పదవీ విరమణ ఆదాయ ప్రణాళిక ఆర్థిక స్వాతంత్య్రం, భద్రతను నిర్ధారిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్‌లు, యాన్యుటీలు, ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలలో వైవిధ్యభరితంగా మారడం ద్వారా పదవీ విరమణ పొందినవారు స్థిరమైన, ద్రవ్యోల్బణ నిరోధక రాబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి