Portable AC: వామ్మో.. ఇదేం ఏసీ భయ్యా.! ఆన్ చేస్తే చాలు.. అటు చల్లదనం, ఇటు వెచ్చదనం..

వేడి, ఉక్కపోతలకు చెక్ పెడింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు.. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఇంకా చెప్పాలంటే.. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు మరీ తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఇలాంటి సమయంలో.. ఆ వివరాలు..

Portable AC: వామ్మో.. ఇదేం ఏసీ భయ్యా.! ఆన్ చేస్తే చాలు.. అటు చల్లదనం, ఇటు వెచ్చదనం..
Portable Ac 2 In 1
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 11, 2024 | 5:34 PM

వేడి, ఉక్కపోతలకు చెక్ పెడింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు.. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. ఇంకా చెప్పాలంటే.. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు మరీ తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఇలాంటి సమయంలో కొందరికి హీటర్‌తో పని పడుతుంది. రూమ్ అంతటా కూడా చల్లని గాలి వ్యాపించినా కష్టమే. శరీరం పూర్తిగా చల్లబడిందంటే.. లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి అలాంటివారి కోసం ఓ చక్కటి గోడ ఏసీని తీసుకొచ్చేశాం. ఇది చల్లటి గాలిని నలుమూలల వ్యాపించడమే కాదు.. కావాల్సినప్పుడల్లా వెచ్చదనాన్ని కూడా అందిస్తుంది. టూ-ఇన్-వన్ అనమాట. తక్కువ ధరకే లభిస్తోంది. మరి దాని ఫీచర్లు, ధర ఏంటో తెలుసుకుందామా..

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అమ్మకానికి ఉన్న ఈ టూ-ఇన్-వన్ ఏసీ వాస్తవ ధర రూ. 14,972 కాగా 29 శాతం డిస్కౌంట్‌తో రూ. 10,694కి లభిస్తోంది. ఒకేసారి ఈ మొత్తాన్ని కట్టలేకపోయినా.. దీన్ని సొంతం చేసుకోవడానికి ఈఎంఐ ఆప్షన్ సైతం అందుబాటులో ఉంది. దీని బరువు పోర్టబుల్ ఏసీ మాదిరిగా ఉండటంతో.. ఈ ఏసీని మీరు ఇంట్లో ఏ రూమ్‌లోనైనా ఫిక్స్ చేసుకోవచ్చు.

ఇందులో నుంచి వచ్చే శబ్దం కూడా తక్కువ కావడంతో.. మీ పనులకు ఎలాంటి ఆటంకం కలగదు. అలాగే ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ కూలింగ్, హీటింగ్ మెకానిజం.. బయట నుంచి వచ్చే గాలిని మీకు అనువుగా మారుస్తుంది. ఈ ఏసీలోని అమర్చిన ఫ్యాన్.. రిమోట్ కంట్రోల్ ద్వారా మీరు ఎంచుకునే మోడ్‌కి సరిపడా గాలిని రూమ్ అంతటికి అందిస్తుంది. 1 గంట నుంచి సుమారు 6 గంటల వరకు ఈ ఏసీలోని టైమర్‌ను మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ ఏసీకి సుమారు 220 వోల్టేజ్‌ల కరెంట్ అవుతుంది. లేట్ ఎందుకు ఓసారి దీనిపై లుక్కేయండి.(Source)

ఇది చదవండి: ఎలారా ఇలా.. సామాన్య ప్రయాణీకుల్లా ఆర్టీసీ బస్సెక్కారు.. కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..