AP News: ఎలారా ఇలా.. సామాన్య ప్రయాణీకుల్లా ఆర్టీసీ బస్సెక్కారు.. కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది!

అధికారులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎంత నిఘా పెట్టినా అక్రమార్కులు తమ పంథా మార్చుకోవడంలేదు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పోలీసులు, అధికారుల కళ్లు గప్పి మత్తుపదార్ధాలు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు వ్యక్తులు సామాన్య ప్రయాణికుల్లా బస్సుఎక్కారు.

AP News: ఎలారా ఇలా.. సామాన్య ప్రయాణీకుల్లా ఆర్టీసీ బస్సెక్కారు.. కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది!
Apsrtc
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 11, 2024 | 12:57 PM

అధికారులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎంత నిఘా పెట్టినా అక్రమార్కులు తమ పంథా మార్చుకోవడంలేదు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పోలీసులు, అధికారుల కళ్లు గప్పి మత్తుపదార్ధాలు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తాజాగా ఇద్దరు వ్యక్తులు సామాన్య ప్రయాణికుల్లా బస్సుఎక్కారు. ఎందుకో వారిని చూడగానే అనుమానం కలిగిన బస్సుడ్రైవర్‌ బస్సును నేరుగా పోలీస్‌ స్టేషన్‌కి పోనిచ్చాడు. సీన్‌ అర్ధమైన స్మగ్లర్లు బస్సులోంచి దూకేసారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో ఆర్టీసీ బస్సులో గంజాయి కలకలం రేపింది. ప్రయాణికుల ముసుగులో గంజాయితో బస్సెక్కిన ఇద్దరు స్మగ్లర్లను బస్సు డ్రైవర్‌ గుర్తించాడు. వారికి ఎలాంటి అనుమానం రాకుండా చాకచక్యంగా బస్సును పోలీస్ స్టేషన్‌కి మళ్లించాడు. పోలీస్ స్టేషన్ వద్దకు బస్సు రాగానే నేరగాళ్లు బస్సులో నుండి దూకే ప్రయత్నం చేశారు. వారిని బస్సు డ్రైవర్‌, ఇతరులు పట్టుకోడానికి ప్రయత్నించారు. అయితే వారిద్దరూ తప్పించుకొని పారిపోయారు. స్మగ్లర్లు బ్యాగుల్లో తరలిస్తున్న 14 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారి కోసం గాలింపు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్‌లో ఏముందో తెలిస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి