Chiranjeevi: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి మెగాస్టార్.. స్పెషల్ ఫ్లైట్‌లో విజయవాడకు

చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి  ప్రధాని మోదీ హాజరుకానున్నారు. మోదీతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కేసరపల్లి ఐటీ పార్క్‌ దగ్గర చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం గ్రాండ్ గా జరగనుంది. ఐదుగురు ఐఏఎస్‌ అధికారుల ఆధ్వర్యంలో పనుల పర్యవేక్షిస్తున్నారు. 11.5 ఎకరాల్లో సభా ప్రాంగణం, 2.5 ఎకరాల్లో సభా వేదిక ఏర్పాటు చేశారు.

Chiranjeevi: చంద్రబాబు ప్రమాణస్వీకారానికి మెగాస్టార్.. స్పెషల్ ఫ్లైట్‌లో విజయవాడకు
Chiranjeevi, Chandrababu
Follow us

|

Updated on: Jun 11, 2024 | 1:58 PM

రేపే(జూన్ 12న) ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం 11:27 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి  ప్రధాని మోదీ హాజరుకానున్నారు. మోదీతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కేసరపల్లి ఐటీ పార్క్‌ దగ్గర చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం గ్రాండ్ గా జరగనుంది. ఐదుగురు ఐఏఎస్‌ అధికారుల ఆధ్వర్యంలో పనుల పర్యవేక్షిస్తున్నారు. 11.5 ఎకరాల్లో సభా ప్రాంగణం, 2.5 ఎకరాల్లో సభా వేదిక ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, వీఐపీలతోపాటు నేతలు, ప్రజల కోసం 36 గ్యాలరీలు సిద్ధం చేశారు. అలాగే 7 వేల మంది పోలీసులతో భారీభద్రతను కూడా ఏర్పాటు చేశారు.అన్నిమార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు రేపు చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను మళ్లించారు.

ఇక చంద్రబాబు ప్రమాణస్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. చంద్రబాబు చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం పంపించారు. స్టేట్ గెస్ట్ గా నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ చిరంజీవికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇక ఈ రోజు సాయంత్రం 5 గంటలకు స్పెషల్ ఫ్లైట్లో బేగంపేట నుంచి విజయవాడ వెళ్లనున్నారు చిరంజీవి. ఇక మోదీ రాక ప్రాధాన్యత సంతరించుకుంది.

రేపు ఉ.10:40కి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు  ప్రధాని మోదీ. బుధవారం ఉ. 10:55 గంటలకు కేసరపల్లి దగ్గర ఐటీ పార్క్‌కు చేరుకుంటారు మోదీ. ఉ.11 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సరిగ్గా బుధవారం ఉ. 11.27 గంటలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. తిరిగి మ.12:45కు భువనేశ్వర్‌ వెళ్లనున్నారు ప్రధాని మోదీ. చంద్రబాబు ప్రమాణస్వీకారనికి మోదీతో పాటు అమిత్‌షా సహా కేంద్ర మంత్రులు హాజరుకాబోతున్నారు. పలు రాష్ట్రాల సీఎంలు కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
ఈ పండుని వదలకండి.. పోషకాలతో ఫుల్ ఆరోగ్యం..!
ఈ పండుని వదలకండి.. పోషకాలతో ఫుల్ ఆరోగ్యం..!
డ్రగ్స్ కేసులో బుజ్జిగాడు హీరోయిన్‏కు ఊరట..
డ్రగ్స్ కేసులో బుజ్జిగాడు హీరోయిన్‏కు ఊరట..
అటవీశాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న చిరుత...! ఎక్కడంటే
అటవీశాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతున్న చిరుత...! ఎక్కడంటే
వేణు చిరునవ్వుతో మూవీ హీరోయిన్ ఇలా మారిందేంటీ..?
వేణు చిరునవ్వుతో మూవీ హీరోయిన్ ఇలా మారిందేంటీ..?
మైదానంలో సిక్సుల వర్షం.. టీ20 ప్రపంచకప్‌లో రికార్డుల మోత..
మైదానంలో సిక్సుల వర్షం.. టీ20 ప్రపంచకప్‌లో రికార్డుల మోత..
రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది.. లాంచింగ్ ఎప్పుడంటే..
రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది.. లాంచింగ్ ఎప్పుడంటే..
రూ. 33 కోట్లు గెలిచాడు సంతోషంతో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి
రూ. 33 కోట్లు గెలిచాడు సంతోషంతో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి
అరెకరం భూమి ఉంటే చాలు.. ఈ చిన్న ఐడియాతో నెలనెలా ఆదాయానికి..
అరెకరం భూమి ఉంటే చాలు.. ఈ చిన్న ఐడియాతో నెలనెలా ఆదాయానికి..
బాధ లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 4 పనులు చేస్తే చాలు.!
బాధ లేకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 4 పనులు చేస్తే చాలు.!
రాజ్, కావ్యల శోభనానికి అంతా సిద్ధం.. నాకు నువ్వు కావాలి కళావతి..
రాజ్, కావ్యల శోభనానికి అంతా సిద్ధం.. నాకు నువ్వు కావాలి కళావతి..