AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారు VIP నంబర్ నంబర్‌ ఖరీదు రూ.27.50 లక్షలు.. కొన్నది ఎవరో తెలుసా?

Car VIP Number: ఈ నంబర్ అధిక బిడ్లకు అమ్ముడైంది. కానీ ఈసారి 27.50 లక్షల బిడ్ రావడంతో ఇది అత్యంత ప్రీమియం, డిమాండ్ ఉన్న బిడ్ అయింది. అదనంగా హై-ఎండ్‌గా మరికొన్ని నంబర్లు కూడా ఉన్నాయి. కొనుగోలుదారులు వారి నంబర్ ఆధారంగా..

కారు VIP నంబర్ నంబర్‌ ఖరీదు రూ.27.50 లక్షలు.. కొన్నది ఎవరో తెలుసా?
Subhash Goud
|

Updated on: Dec 09, 2025 | 1:37 PM

Share

Car VIP Number: నోయిడా జిల్లాలో ప్రైవేట్ వాహనాల కోసం VIP నంబర్ల కోసం జరిగిన ఆన్‌లైన్ వేలం ప్రక్రియలో అత్యంత ప్రీమియం కారు నంబర్ UP16FH 0001 రికార్డు ధరకు అమ్ముడైంది. M/S AVIORION PRIVATE LIMITED రూ.27,50,000 అత్యధిక బిడ్‌తో ఈ నంబర్‌ను దక్కించుకుంది. వేలం నవంబర్ 7, 2025న ప్రారంభమైంది. ప్రారంభ బిడ్ రూ.33,333. పోటీలో చాలా మంది పాల్గొన్నారు. తుది బిడ్ రూ.27.50 లక్షలకు చేరుకుంది.

ఆ నంబర్ ఎవరికి వచ్చింది?

నోయిడాకు చెందిన మెస్సర్స్ ఏవియోరియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ మెర్సిడెస్ కారునుకు కొనుగోలు చేసింది. ఆన్‌లైన్‌లో రూ.27,16,667 డిపాజిట్ చేయడం ద్వారా ప్రక్రియను పూర్తి చేసింది. డిపార్ట్‌మెంట్ ప్రకారం, కంపెనీ నిర్ణీత సమయంలోపు చెల్లింపు చేసింది. ఆ తర్వాత UP16FH 0001 నంబర్‌ను కంపెనీకి కేటాయించారు. రవాణా శాఖ ప్రకారం, వేలం నియమాల ప్రకారం గెలిచిన దరఖాస్తుదారుడు నిర్ణీత సమయంలోపు మిగిలిన మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. అలా చేయడంలో విఫలమైతే బిడ్ చెల్లదు. కానీ AVIORION సకాలంలో చెల్లింపు చేయడం ద్వారా నంబర్‌పై దక్కించుకుంది.

ఇది కూడా చదవండి: Best Car: ఇదేందిరా నాయనా.. ఎగబడి కొంటున్నారు.. మరోసారి నంబర్‌ 1 స్థానంలో..!

ఇవి కూడా చదవండి

0001 సంఖ్య ఎందుకు ప్రత్యేకమైనది?

ఢిల్లీ NCRలో ఉత్తరప్రదేశ్‌తో సహా, 0001 ఎల్లప్పుడూ VIP నంబర్‌గా పరిగణిస్తున్నారు. దీనిని సాధారణంగా పెద్ద వ్యాపారాలు, కంపెనీలు, ఆటోమొబైల్ కలెక్టర్లు, హై-ప్రొఫైల్ వాహన యజమానులు ఇష్టపడతారు. ఇది తరచుగా వేలంలో అధిక బిడ్డింగ్‌కు దారితీస్తుంది. అసిస్టెంట్ డివిజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. AVIORION PRIVATE LIMITED అత్యధిక బిడ్‌ను వేసి అత్యధిక మొత్తం రూ.27.50 లక్షలకు చేరుకుంది. కంపెనీ మిగిలిన మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత ఈ నంబర్ కేటాయించారు. ఇప్పటివరకు వచ్చిన అత్యధిక బిడ్‌లలో ఇది ఒకటి.

ఇది కూడా చదవండి: Tata Nexon: కేవలం రూ.10,000 EMIతో టాటా నెక్సాన్ కొనొచ్చు.. ఎన్నేళ్లు చెల్లించాలి?

నోయిడాలో ఇంతకు ముందు 0001 నంబర్ అధిక బిడ్లకు అమ్ముడైంది. కానీ ఈసారి 27.50 లక్షల బిడ్ రావడంతో ఇది అత్యంత ప్రీమియం, డిమాండ్ ఉన్న బిడ్ అయింది. అదనంగా హై-ఎండ్‌గా మరికొన్ని నంబర్లు కూడా ఉన్నాయి. కొనుగోలుదారులు వారి నంబర్ ఆధారంగా వారి నంబర్‌లను బుక్ చేసుకుంటారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు. ఆ నంబర్ వారికి కేటాయిస్తారు.

Success Story: చదివింది 6వ తరగతి.. వినూత్న ఆలోచనలో అద్భుతమైన వ్యాపారం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి