Paytm Share: పేటీఎం షేర్లను కొన్న విజయ శేఖర్ శర్మ.. ఎందుకలా చేశారంటే..

Paytm Share: పేటీఎం ఎండీ విజయ శేఖర్ శర్మ కొత్తగా మరిన్ని షేర్లను కొనుగోలు చేశారు. మార్కెట్ నుంచి 11 కోట్ల రూపాయల విలువైన పేటీఎం షేర్లను కొత్తగా కొన్నారు.

Paytm Share: పేటీఎం షేర్లను కొన్న విజయ శేఖర్ శర్మ.. ఎందుకలా చేశారంటే..
Follow us

|

Updated on: Jun 18, 2022 | 8:06 PM

Paytm Share: పేటీఎం ఎండీ విజయ శేఖర్ శర్మ కొత్తగా మరిన్ని షేర్లను కొనుగోలు చేశారు. మార్కెట్ నుంచి 11 కోట్ల రూపాయల విలువైన పేటీఎం షేర్లను కొత్తగా కొన్నారు. మే నెలాఖరు రెండు రోజుల్లో ఇది జరిగినట్లు సెబీ దృవీకరించింది. మే 30న రూ.6.31 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా.. మే 31న రూ.4.68 కోట్ల విలువైన షేర్లను విజయ శేఖర్ శర్మ సొంతం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఐపీవోకి వచ్చిన కంపెనీ తన షేర్లను తానే ఆరు నెలల వరకు కొనుగోలు చేయకూడదు. అందువల్లే ఆయన ఇన్ని రోజులు వేచిఉన్నట్లు తెలుస్తోంది. రానున్న కాలంలో కంపెనీ లాభాల బాటలో పయనిస్తుందని ఆయన షేర్ హోల్డర్లకు గతంలోనే మాటిచ్చారు. ఈ క్రమంలో 1.7 లక్షల షేర్లను కొనుగోలు చేశారు.

ఈ మధ్యకాలంలోనే ఇన్వెస్ట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్‌ సాక్స్ ప్రమోటర్లే పేటీఎం షేర్లను కొనుగోలుచేసే అవకాశం ఉందని చెప్పిన విషయం మనకు తెలిసిందే. దేశంలో అతి పెద్ద ఐపీవోగా వచ్చిన సమయంలో రూ.2,150 ధరకు మార్కెట్లోకి అరంగేట్రం చేసింది. కానీ తరువాత వరుసగా నష్టాల్లోకి జారుకున్న షేర్.. కొన్ని రోజుల క్రితం ఆల్ టైమ్ కనిష్ఠమైన రూ.511ని తాకింది.

మరో పక్క 2021 సెప్టెంబర్ తో ముగిసిన క్వార్టర్లో కంపెనీ రూ.481 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు క్వార్టర్ లో అది రూ.376 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. మరో పక్క వ్యాపార ఆదాయం కూడా కంపెనీకి గణనీయంగానే పెరుగుతోంది. బిజినెస్ ఆపరేషన్స్ వల్ల ఆదాయం 69 శాతం పెరిగి రూ.842 కోట్లు నమోదుకాగా.. క్లౌడ్‌ సేవలు ఆదాయం 47 శాతం పెరిగి రూ.243 కోట్లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.