UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. మ్యాటర్ ఏంటంటే..

|

Aug 21, 2022 | 9:31 PM

యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ సేవలపై ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వం ఎలాంటి పరిశీలన  చేయలేదని ఆర్థిక శాఖ పేర్కొంది.

UPI Payments: యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. మ్యాటర్ ఏంటంటే..
Upi
Follow us on

UPI Payment Charges: డిజిటల్ బ్యాంకు లావాదేవీలపై (UPI) కేంద్ర ప్రభుత్వం ఛార్జీలు విధించనున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం రాత్రి దీనిపై క్లారిటీ ఇచ్చింది. UPI సేవలపై ఎలాంటి ఛార్జీలు విధించడం లేదని కేంద్రం స్పష్టంచేసింది. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ సేవలపై ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వం ఎలాంటి పరిశీలన  చేయలేదని ఆర్థిక శాఖ పేర్కొంది. కాస్ట్ రికవరీ కోసం సర్వీస్ ప్రొవైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి UPI చెల్లింపులకు అదనపు ఛార్జీలు వడ్డించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది.

‘‘UPI అనేది ప్రజలకు అపారమైన సౌలభ్యం, ఆర్థిక వ్యవస్థకు ఉత్పాదకత లాభాలతో కూడిన డిజిటల్ పబ్లిక్ గుడ్. UPI సేవలకు ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వంలో ఎలాంటి పరిశీలన లేదు. కాస్ట్ రికవరీ కోసం సర్వీస్ ప్రొవైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చాలి. ప్రభుత్వం గత సంవత్సరం డిజిటల్ పేమెంట్ పర్యావరణ వ్యవస్థకు ఆర్థిక సహాయాన్ని అందించింది. డిజిటల్ పేమెంట్స్, చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లను ఆర్థికంగా వినియోగదారు-స్నేహపూర్వకంగా ప్రోత్సహించడానికి ఈ సంవత్సరం కూడా అదే విధంగా ప్రకటించింది’’ అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది.

ఇవి కూడా చదవండి

కాగా.. ప్రస్తుతం అధిక లావాదేవీలు స్మార్ట్ ఫోన్ నుంచి డిజిటల్ పేమెంట్స్ (యూపీఐ) ద్వారానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం యూపీఐ సేవలపై ఛార్జీలు విధించడం లేదని క్లారిడీ ఇవ్వడంతో వినియోగదారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి