Komaki Electric Scooter: అప్‌డేటెట్ ఫీచర్లతో కోమకి ఎలక్ట్రిక్ స్కూటర్ రీ లాంచ్.. అదిరే రేంజ్.. ధర మాత్రం అందుబాటులోనే..
ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో ఇప్పటికే తన సత్తా చూపిన కోమకి కంపెనీ ఇప్పుడు పాత మోడల్ ను సరికొత్తగా అడ్ డేట్ చేసి ఆవిష్కరించింది. కోమకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొత్త ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ మోడల్ ఇప్పుడు లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ తో వస్తోంది.
మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద ఎత్తున లాంచ్ అవుతున్నాయి. ముఖ్యంగా స్కూటర్లకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. పురుషులు, మహిళలు వినియోగించకునే వీలుండటం, సిటీ పరిధికి సరిగ్గా సరిపోతుండటంతో అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని కంపెనీలు విద్యుత్ శ్రేణి స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పటికే ఉన్న పలు మోడళ్లలో కొత్త ఫీచర్లు యాడ్ చేసి అప్ గ్రేడ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల శ్రేణిలో ఇప్పటికే తన సత్తా చూపిన కోమకి కంపెనీ ఇప్పుడు పాత మోడల్ ను సరికొత్తగా అడ్ డేట్ చేసి ఆవిష్కరించింది. కోమకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొత్త ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ స్కూటర్ మోడల్ ఇప్పుడు లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ తో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1, ఏథర్ 450ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్, విడా వీ1 ప్రో వంటి వాటితో పోటీపడనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి..
కోమకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, లభ్యత..
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో, స్పోర్ట్ స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, వీటి ధరలు వరుసగా ధర రూ. 96,968, రూ. 1,29,938, రూ. 1,38,427 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ కోమకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ జెట్ బ్లాక్, రాయల్ బ్లూ, ప్యూర్ గోల్డ్, గార్నెట్ రెడ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది .
కోమకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్‌లు..
ఈ స్కూటర్ లో 3 kW సామర్థ్యంతో హబ్ మోటార్ ఉంది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై ఎకో వేరియంట్ 75 కి.మీ నుండి 90 కి.మీల రేంజ్ ఇస్తుంది. అదే స్పోర్ట్స్ వేరియంట్ స్కూటర్ అయితే 110 కిమీల నుంచి 140 కిమీ వరకు రేంజ్ ఇస్తుంది. అదే స్పోర్ట్స్ పెర్ఫామెన్స్ అప్ గ్రేడ్ వెర్షన్ అయితే 150 కి.మీ నుంచి 180 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. బ్యాటరీ చార్జింగ్ ఇంట్లో చేస్తే నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది. గరిష్టంగా గంటకు 75 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలుగుతుంది.
ఫీచర్లు ఇవి..
ఈ స్కూటర్లో ఎకో, స్పోర్ట్, టర్బో అనే మోడ్లు ఉంటాయి. సింగిల్ సైడెడ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డ్యూయల్ షాక్ రియర్ ఉంటాయి. అల్లాయ్ వీల్స్, డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్, యాంటీ-స్కిడ్ టెక్నాలజీని అందించారు. పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ వంటి కొత్త ఫీచర్లను అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..