దేశంలో ప్రతి ఒక్కరు కట్టెల పొయ్యిపై వంట చేసుకోకుండా ఉండేందుకు ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకాన్ని ప్రారంభించారు ప్రధాని మోడీ. కట్టెల పొయ్యిపై వంట చేసుకోవడం వల్ల పొగ వల్ల కంటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో అందరి ఇళ్లలో గ్యాస్ కనెక్షన్ ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్‌ను అందిస్తోంది కేంద్రం. దేశంలో నిరుపేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ కనెక్షన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో చాలా మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్‌లు అందాయి. మీరు కూడా ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం కింద ఉచిత ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం కింద వినియోగదారులకు 14.2 కిలోల సిలిండర్, స్టవ్ అందజేస్తున్నారు. దీని ధర దాదాపు 3200 రూపాయలు. ప్రభుత్వం నుండి 1600 రూపాయల సబ్సిడీ లభిస్తుంది. అయితే 1600 రూపాయలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) అడ్వాన్స్‌గా ఇస్తాయి. అయితే ఏఎంసీలు రీఫిల్‌లపై సబ్సిడీ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో వసూలు చేస్తాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో 1 కోటి కొత్త కనెక్షన్లు ఇస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల తరపున ముందస్తు చెల్లింపు నమూనాను మార్చే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో కొత్త కనెక్షన్ల కోసం సబ్సిడీకి సంబంధించిన ప్రస్తుతం ఉన్న విధానంలో మార్పులు చేయవచ్చు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ రెండు కొత్త విధానాలకు సంబంధించిన పనులను ప్రారంభించిందని, త్వరలో విడుదల చేయనున్నట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.
నివేదికల ప్రకారం.. ముందస్తు చెల్లింపు సంస్థ ఏకంగా రూ.1600 వసూలు చేస్తుంది. ప్రస్తుతం ఆయిల్ కంపెనీలు ఈఎంఐ రూపంలో అడ్వాన్స్ మొత్తాన్ని వసూలు చేస్తాయి. ఈ పథకంలో ప్రభుత్వం మిగిలిన 1600 సబ్సిడీని ఇస్తోంది. ఈ ముందస్తు చెల్లింపు విధానంలో త్వరలో మార్పులు జరిగే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి